తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరి కొందరు కొత్త జడ్జీలు రానున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి సిఫార్సు చేసింది..
లాయర్లు గుండెపోటు ఘటనలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కోర్టు ఆవరణల్లో కుప్పకూలుతున్నారు. ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ వేణుగోపాల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యలో మృతి చెందారు. ఇటీవల తెలంగాణ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది..
ముంబై నటి జత్వాని కేసు సంచలనం సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో చర్యలకు కూడా దిగింది ప్రభుత్వం.. అయితే, మరోమారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు సినీ నటి జత్వాని.. రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారామె.. దీంతో.. ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు..
అధిక లాభాలు ఆశ చూపి.. ట్రేడింగ్ పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ కేటగాళ్లు. ట్రేడింగ్ పేరుతో లాభాలు చూపెడతామని అమాయకుల దగ్గర నుంచి కోట్లు వసూలు చేసి చివరకు టోపీ తిప్పేస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదులే టార్గెట్ గా సైబర్ కేటుగాళ్లు పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసే న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్ లో సైబర్ కేటుగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇప్పిస్తామని చెప్పి వారిని బుట్టలోకి దించుతున్నారు ఈ మాయగాళ్లు. దీంతో…
హైకోర్టు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది.