డ్రోన్ కెమెరాలతో పేకాటరాయుళ్ల బరతం పడుతున్నారు ఏపీ పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నవారిని డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో డ్రోన్ కెమేరాతో పేకాటరాయుళ్ల ఆట కట్టించారు పోలీసులు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడేందుకు సిద్ధమయ్యారు. రైల్వే ట్రాక్ సమీపంలో చెట్ల పొదల్లో పేకాటరాయుళ్లు అంతా ఒక్కచోటుకి చేరారు. Also Read:Operation Sindoor: ‘‘సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకింది.. పీఓకే నుంచి మకాం మారుస్తున్న…
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ ఎగరడం సంచలనంగా మారింది.. ఆలయ పరిసరాలపై అర్ధరాత్రి సమయంలో మరోసారి డ్రోన్ ఎగడరంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు..
శ్రీశైలం డ్యామ్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి.. అయితే, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు..
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట పరిసర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో పోలీసులు బీట్ నిర్వహించారు.. తుమ్మలగుంట ఫ్లైఓవర్ పై కొంతమంది యువకులు వాహన చోదకులకు ఇబ్బందులు కల్గించే విధంగా ఫొటోషూట్ పేరుతో ఇబ్బంది కలిగిస్తున్నట్టు గుర్తించింది డ్రోన్ కెమెరా.. ఇక, డ్రోన్ కెమెరా యువకులను చిత్రీకరిస్తున్నట్లు గమనించి వెంటనే.. అక్కడి నుంచి బైకులపై పరారయ్యారు యువకులు
యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కిల్లర్ తోడేళ్ల భయం కొనసాగుతోంది. మహసీలోని ఘఘ్రా బేసిన్‌తో సహా వివిధ 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ శాఖ డ్రోన్ కెమెరాలో బంధించిన ఆరు తోడేళ్లలో ఐదు అధికారులు పట్టుకోగా.. ఒక తోడేలు మాత్రం అటవీశాఖకు సవాలుగా మారింది.
తిరుమలలో మరో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య కలిసి తిరుమల కొండలను వీడియో తీశారు.
మంచిర్యాల పట్టణంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్డౌన్ అమలు తీరుపై డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంచిర్యాల రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బయట తిరిగేవారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘాను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ లేనివారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు…