PM Modi: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. ఇటీవల మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకిది తొలి విదేశీ పర్యటన కాబోతుంది. అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా అనే రిసార్ట్‌లో జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, జపాన్ ప్రధాని ఫుమ్లో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు.
Read Also: IND vs USA: అమెరికాపై చెమటోడ్చి నెగ్గిన భారత్.. సూపర్-8కు రోహిత్ సేన!
అలాగే, ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ఓ సెషన్‌కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుదల గురించిన చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. కాగా, జీ-7 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం జీ-20 ఫలితాలను అనుసరించేందుకు ఉపకరిస్తుందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా పేర్కొన్నారు. ఇక, స్విట్జర్లాండ్‌లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. అయితే భారత్ తరఫున ఎవరు హాజరవుతారనే వివరాలను క్వత్రా వెల్లడించలేదు. కాగా, నేటి నుంచి ఇటలీలో ప్రధాని మోడీ పర్యటన ఉండటంతో బుధవారం నాడు మహాత్మగాంధీ విగ్రహాన్ని ఖలిస్థానీ మద్దతు దారులు ధ్వంసం చేశారు.