AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై నగరంలోని గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. ఆస్కార్ విజేత, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు, ప్రముఖ యువ గాయకుడు ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ వార్త తమిళ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తన స్నేహితుడు భార్గవ్‌తో కలిసి ఏఆర్ అమీన్ కోయంబేడు నుంచి కారులో బయలుదేరారు. గిండి కత్తిపార ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే, ఎదురుగా వస్తున్న ఒక కాల్ టాక్సీని వీరి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ అమ్రీన్, ఆయన స్నేహితుడు భార్గవ్ అలాగే టాక్సీ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అమీన్ , ఆయన స్నేహితుడిని చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించగా, ప్రాథమిక చికిత్స అనంతరం వారిద్దరూ సురక్షితంగా నివాసానికి చేరుకున్నారు. మరోవైపు గాయపడిన టాక్సీ డ్రైవర్‌ను కళైజ్ఞర్ శతాబ్ది ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తండ్రి ఏఆర్ రెహమాన్ లాగే చిన్నతనం నుంచే సంగీతంపై అమితమైన ఆసక్తి పెంచుకున్న అమీన్ , 2015లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓ కాదల్ కణ్మణి’ (తెలుగులో ‘OK బంగారం’) ద్వారా గాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తన విలక్షణమైన, మధురమైన స్వరం ద్వారా సినీ ప్రియులను ఆకట్టుకుంటూ వచ్చారు. శింబు నటించిన ‘పత్తు తల’ చిత్రంలోని ‘నినైవిరుక్కా’, రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలోని ‘సిక్రి’ పాటలతో పాటు హిందీలో ‘భీగీ భీగీ’ ఆల్బమ్ ద్వారా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్‌తో పాటు యువ సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా కాంబినేషన్లో పలు ఆల్బమ్స్, చిత్రాల్లో పాటలు పాడుతూ, భవిష్యత్తులో తండ్రి తగ్గ వారసుడిగా సంగీత ప్రపంచాన్ని ఏలబోతున్నారనే గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!