PM Modi: మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్నికల వేళ ఏపీపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఈ ఎయిమ్స్ వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. దీనిని కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మంగళగిరి ఎయిమ్స్‌లోని 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.1,618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను మోడీ ప్రారంభించారు. యానాం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించిన జిప్మర్ మల్టీస్పెషాలిటీ యూనిట్‌ను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు.
Read Also: Uttarakhand: ఆందోళనల్లో “ఆస్తి నష్టాన్ని రికవరీ చేసేందుకు బిల్లు”ని తీసుకురానున్న ఉత్తరాఖండ్..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
మంగళగిరి ఎయిమ్స్‌లో 2019 మార్చి నుంచే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజుకు రెండున్నర వేల మంది రోగులు అక్కడ వైద్యం పొందుతున్నారు. 2018 నుంచే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రస్తుతం 600 మంది వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో 100 మంది వివిధ కోర్చుల్లో పీజీ చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి పారామెడికల్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ఏపీ మంత్రి విడదల రజని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు జీవిఎల్, సీఎం రమేష్, అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!