మంగళగిరి ఎయిమ్స్‌ను పేదల కోసం ఉపయోగపడేలా ప్రధాని మోడీ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తెలుసుకోవాలని లేనివాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు... మోదీ ప్రభుత్వం చేసిన మార్పులను అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల వేళ ఏపీపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఈ ఎయిమ్స్ వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు.