ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన చిత్రం పుష్ప -2. ఈ సినిమాలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పుష్ప -2 అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిచింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజుల థియేట్రికల్ రన్ కూడా కంప్లిట్ చేసుకుంది.
Also Read : Manchu Manoj : పోలీసులతో గొడవ.. వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్
ఇక ఈ సినిమా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బెంచ్ మార్క్ సెట్ చేసింది. విడుదలైన మొదటి 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అత్యంత వేగంగా ఈ ఫీట్ ను అందుకున్న సినిమాగా ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. ఇక ఇటీవల ఈ సినిమా అర్ధశతదినోత్సవ వేడుకను పురస్కరించుకుని థాంక్స్ మీట్ కూడా నిర్వహించి యూనిట్ కు ప్రత్యేక షీల్డ్స్ కూడా ఇచ్చారు మేకర్స్. తాజాగా పుష్ప 2 కలెక్షన్స్ కు సంబంధించి మరొక పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణసంస్థ. విడుదల నాటి నుండి ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 1871 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని, ఇది పుష్ప రాజ్ బ్రాండ్ అని సింబాలిక్ గా తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డు అని పోస్టర్ లో పేర్కొన్నారు నిర్మాతలు. మరోవైపు 2024 లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప -2