Site icon NTV Telugu

PSL: పాక్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు కొనసాగింపు.. కానీ..

Psl

Psl

భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సిన పీఎస్‌ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.

READ MORE: India-Pakistan War: భారత్, పాకిస్థాన్‌కు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఫోన్.. ఏమన్నారంటే?

కాగా.. గురువారం రాత్రి పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2025 మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఒక డ్రోన్ కూలింది. ఈ డ్రోన్ ప్రమాదం పెషావర్ జల్మి, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్‌కి కొన్ని గంటల ముందే చోటు చేసుకుంది. భారత్ దాడితో పీసీబీ వణికిపోయింది. పీఎస్‌ఎల్ 2025 మ్యాచ్‌లను ఉన్నపళంగా కరాచీకి మార్చింది. పీఎస్ఎల్‌ 2025లో ఇంగ్లండ్ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు పీఎస్ఎల్‌ 2025లోనే కొనసాగాలా? లేదా వెంటనే పాకిస్థాన్ వీడాలా అనే అంశంపై ఆలోచించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించింది. ఆటగాళ్ల విషయంలో ఈసీబీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

READ MORE: India-Pakistan War: సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. పెద్దఎత్తున చొరబాటుకు యత్నం..

Exit mobile version