Pakistan: పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది భారత్. ఇటు ఉగ్రవాదుల స్థావరాలను నాశం చేస్తూనే, మరోవైపు పాక్ మిలిటరీకి గట్టి గుణపాఠం నేర్పింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతను కూడా భారత్ బహిర్గతం చేసింది. ఇన్నాళ్లు తమ మిలిటరీ శక్తిని చూస్తూ గర్వపడిన పాకిస్తాన్‌కి భారత్ గర్వభంగం చేసింది. తమతో పెట్టుకుంటే పాకిస్తాన్ హర్ట్ ల్యాండ్‌లో కూడా దాడులు చేస్తామని నిరూపించింది.
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సిన పీఎస్‌ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.
పాకిస్థాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బలూకిస్థాన్ నుంచి ఓ వార్త వెలువడుతోంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. ప్రపంచ క్రీడ ప్రపంచంలో పాకిస్థాన్ అవమానకరంగా నిలిచే అవకాశం రాబోతుంది. పాకిస్థాన్ త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్యం కొనసాగించడం లేదా తప్పించడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అయితే, ఇందుకు పాకిస్థాన్ లోని మూడు ప్రధాన క్రికెట్ స్టేడియాలు లాహోర్, రావల్పిండి, కరాచీలో ఏర్పాట్లు…
Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్ కేంద్రంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సమ్మిట్ జరగబోతోంది. ఈ సమావేశానికి భారత్ తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లబోతున్నారు.
Pakistan: హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్, గ్లోబల్ టెర్రరిస్ట్ సయ్యద్ సలాహుద్దీన్ ఇటీవల పాకిస్తాన్‌లో హతమైన భారతదేశం వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలకు నాయకత్వం వహించినట్లు గుర్తించారు. బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. అక్కడ సయ్యద్ సలాహుద్దీన్‌ను పాకిస్తాన్ సైనికులు చుట్టుముట్టినట్లు చూడవచ్చు. నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని సురక్షిత ప్రదేశంలో అంత్యక్రియలు జరిగాయి. వైరల్ ఫుటేజీలో సలావుద్దీన్ భారతదేశాన్ని నాశనం…