భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సిన పీఎస్‌ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.
Noman Ali: ముల్తాన్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. జనవరి 25 శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 38 ఏళ్ల నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌పై ప్రతాపం చూపించాడు. మ్యాచ్‌లో తొలిరోజే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి పాక్ స్పిన్నర్ గా రికార్డ్ సృష్టించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే నోమన్ దెబ్బకు…
గాలి కాలుష్యం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంలోనే కాకుండా.. పాకిస్తాన్‌లో కూడా బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రెండు నగరాలు లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్‌డౌన్ విధించారు. తీవ్ర గాలి కాలుష్యం కారణంగా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముల్తాన్ నగరంలో AQI 2000 దాటింది. లాహోర్‌లో AQI 1100 కంటే ఎక్కువగానే కొనసాగుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పంజాబ్ ప్రభుత్వం లాహోర్, ముల్తాన్‌లలో పూర్తి లాక్‌డౌన్ విధించిందని పాక్ మీడియా…
17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ గడ్డపై టెస్టు సిరీస్ ఆడడానికి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి రెండో టెస్టుకు సన్నద్ధం అవుతున్న సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల ముల్తాన్‌లో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్‌లోని నిస్తార్ ఆస్పత్రిలో సుమారు 200 మృతదేహాలు మార్చురీ పైకప్పుపై కుళ్లిన స్థితిలో బయటపడడం కలవరం రేపింది.