2025 ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతలో పూణేకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ మ్యాచ్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మ్యాచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ ఆఫ్ మాండమస్ లేదా ఇతర తగిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
భారతదేశం నుంచి ప్రతీకార దాడుల తర్వాత.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా రావల్పిండి, ముల్తాన్, లాహోర్‌లలో జరగాల్సిన పీఎస్‌ఎల్ చివరి ఎనిమిది మ్యాచ్‌లను ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించనున్నట్లు పీసీబీ ధృవీకరించింది. రాబోయే 6 రోజుల్లో పీసీఎల్ తిరిగి ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 6న జరిగే ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యింది. ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 8న నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి గేటును ట్రాక్టర్ తో గుద్ది డ్యామేజ్ చేశారన్నారు.
CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు ఆరోపణలతో విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. అయితే.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఎంఆర్ కాలేజీ యాజమాన్యం కళాశాల గేట్లకు తాళం వేసి లోపలికి ఎవరినీ అనుమతించడం…
CMR College : మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లలో రహస్యంగా కెమెరాలు అమర్చి, వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై హాస్టల్ వంట సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థినులు…
ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో అనుమానాస్పద పడవను కనుగొన్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.. వారంతా తమిళనాడులోని కన్యాకుమారి వాసులని పోలీసులు తెలిపారు.