Perni Nani: పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినేని సెటైర్ల వర్షం కురిపించారు. ఈనెల 14 నుంచి వారాహి యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే వారాహి యాత్రపై వైసీసీ నేతలు తమదైన శైలిలో కామెంట్లు కురిపిస్తున్నారు. తాజాగా స్పందించిన పేర్ని నాని.. వారాహి మీద పవన్ కళ్యాణ్ ది టూర్ ప్యాకేజీనా అంటూ ప్రశ్నించారు. పవన్ తన యాత్రకు అన్నవరం భీమవరం అని కాకుండా చంద్రవరం అని పెట్టాల్సింది అని పేర్నినాని ఎద్దేవా చేశారు.
Read Also: Rahul Gandhi: మరోసారి ప్రధాని మోడీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
వారాహి యాత్రపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సినిమా మొదలు పెట్టేటప్పుడు క్లాప్ కొట్టి చెప్పే డైలాగుల్లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. నాకు అధికారం అవసరం లేదు… ముఖ్యమంత్రి చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఇంకేంటి ప్రజల్లోకి వెళ్ళేదంటూ ప్రశ్నించారు. ఇది చంద్రయాత్ర అని ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబును పొగడటమే పవన్ కళ్యాణ్ పని అంటూ కామెంట్స్ చేశారు. వారాహి అంటే దసరా నుంచి గిర్రున తిరుగుతుంది అదేనా.. తిరగటం లేదా అంటూ సెటైర్లు వేశారు. వారాహిని తెలంగాణలో దాచి పెట్టారా.. ఇప్పుడు చంద్రబాబు గోదావరి జిల్లాల్లో తిరగమని చెప్పి ఉంటాడంటూ పేర్ని నాని అన్నారు. ఆ ప్రాంతమైతే.. లోకేష్ యాత్రకు అడ్డు రాదు కదా అని తీవ్రంగా వ్యంగ్యస్త్రాలు సంధించారు పేర్ని నాని.
Read Also: PERNI NANI: రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నారు?.. పేర్ని నాని మండిపాటు
దసరా, సంక్రాంతి, ఉగాది అయిపోయాయి. అన్నవరం ..భీమవరం కన్నా చంద్రబాబు యాత్ర అనడం బెటర్ అని కామెంట్స్ చేశాడు పేర్ని నాని. అన్నవరం – భీమవరం బదులు చంద్రవరంయాత్ర అంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాలుగు పీ లు చెబుతున్నాడని.. దీని అర్ధం ప్రైవేటు, ప్రైవేటు, ప్రైవేటు, ప్రైవేటు అని అన్నారు. అదే జగన్ ఐతే ఏదైనా పబ్లిక్, పబ్లిక్, పబ్లిక్, పబ్లిక్ అంటాడని పేర్ని తెలిపారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు అంటే సంపద సృష్టి కాదా అని ప్రశ్నించారు. అంతేకాకుండా బందరు పోర్టు ప్రభుత్వం నిర్మిస్తోందని పేర్కొ్న్నారు. జగన్ సంపద సృష్టిస్తుంటే చంద్రబాబు ప్రైవేటుకు దోచి పెట్టాడని ఆరోపించారు.