Kavya Kalyanram: గంగోత్రి సినిమాతో బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్. పిల్లి కళ్లతో ఎంతో ముద్దుగా ఉండే ఈ పాప.. ఇప్పుడు హీరోయిన్ గా మారి వరుస హిట్లను అందుకుంటుంది. మసూద, బలగం సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ చిన్నది తాజాగా శ్రీసింహా కోడూరి సరసన ఉస్తాద్ చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాములు హల్చల్ చేయడం లేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకొంటుంది. తాజాగా కావ్య కళ్యాణ్ రామ్.. బాస్ సాంగ్ తో అభిమానులను ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న చిత్రం భోళా శంకర్. ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. ఆగస్టు 11 న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Chinmayi: సింగర్ చిన్మయి పిల్లలను చూశారా .. ఎంత ముద్దుగా ఉన్నారో
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి భోళా భోళా సాంగ్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. చిరు మాస్ స్టెప్పులతో అదరగొట్టిన ఈ సాంగ్ కు కావ్య కళ్యాణ్ రామ్ స్టెప్పులు వేసింది. అచ్చుగుద్దినట్లు చిరు స్టెప్స్ ను దింపేసింది. బ్లూ కలర్ జీన్స్ పై బ్లాక్ కలర్ టీ షర్ట్ దానిపై వైట్ షర్ట్ పై తో మాస్ స్టెప్స్ అదరగొట్టింది. ఇక భోళా హుక్ స్టెప్ కు అయితే మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మెగా ఫ్యాన్స్.. బాస్ సాంగ్ కు డ్యాన్స్ అంటే ఇలా చేయాలి.. కావ్య పాప.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ముందు ముందు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుందో లేదో చూడాలి.
https://www.instagram.com/p/Ctn4P3IJ9KQ/