స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో జరిగిన గిరిజన ఉత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా చేతికి ఖడ్గం ఇచ్చారు, ఖడ్గం ఇచ్చారు అంటే నా బాధ్యత మరింత పెంచారని ఆయన అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని, ఆ అవినీతిని ఖడ్గంతో అంతమోందించాలని బాధ్యత నాకు బాధ్యత అప్పజెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజకీయాల్లో నిజాయితీగా నిక్కసిగా పనిచేశానని, మీకు చెడ్డ పేరు తేలేదు మీరు తల దించుకునే పని కూడా ఎప్పుడు చేయలేదన్నారు. అంతేకాకుండా.. ‘స్టేషన్ ఘనపూర్ అభివృద్ధిలో , మీ తండాల అభివృద్ధిలో మీకు అండగా ఉంటా. మనకు ఒక అవకాశం వస్తే , ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తే ఆ అవకాశం ఆ ప్రాంత అభివృద్ధికి పేద ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన వాళ్లు స్వార్థంతో సంపాదించుకునే ప్రయత్నం చేస్తే పేద ప్రజలు అభివృద్ధి చెందారు. దాదాపు 36 సంవత్సరాలుగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ నాకు రాజకీయ జన్మనిచ్చింది.’ అని ఆయన అన్నారు.
Also Read : Groundwater Pumping: “భూమి భ్రమణ అక్షాన్ని” మారుస్తున్న భూగర్భ జలాల వినియోగం..
దీంతో పాటు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ కడియం ఫైర్ అయ్యారు. దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జరుపుతూ ఉంటే , దశాబ్ది ఉత్సవాలు కాదు దగా ఉత్సవాలు అంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం దగా చేయడమేనా అని ఆయన ప్రశ్నించారు. ‘తెలంగాణ తలసరి ఆదాయంలో మొదటి వరుసలో ఉంది. తెలంగాణ విద్యుత్ వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో మొదటి వరుసలో ఉంది. అధికార యావతో విమర్శలు చేయడం చాలా బాధాకరం. గతంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరి పాలించింది. పది సంవత్సరాల పరిపాలన కాలంలో తెలంగాణకు ఓరగబెట్టిందేమిటి. కాంగ్రెస్ బీజేపీలు రెండు తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపెడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే , మన తెలంగాణ దేశానికి ఆదర్శం కావాలంటే కెసిఆర్ నాయకత్వమే శరణ్యం. గిరిజన తండాలు మొత్తం కేసీఆర్ వెంటే ఉంటాయి.’ అని ఆయన అన్నారు.
Also Read : Rakesh Master: రాకేష్ మాస్టర్ అసలు పేరు ఏంటో తెలుసా..?