నేడు విజయవాడకు పవన్ కల్యాణ్ రానున్నారు. ఈ సందర్భంగా.. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు పవన్. మూడో విడత వారాహి యాత్ర రూట్ మ్యాప్, తేదీ ఖరారుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మూడో విడత యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టాలా..? లేదా ఉత్తరాంధ్రలో చేపట్టాలా..? అనే అంశంపై పవన్ చర్చించనున్నారు. మూడో తేదీ లేదా ఐదో తేదీన మూడో విడత వారాహి యాత్రపై చేపట్టే అవకాశం ఉంది. అయితే.. ఇదిలా ఉంటే.. ఉమ్మడి గోదావరి జిల్లాలు టార్గెట్ గా పవన్ తన యాత్ర ప్రారంభించారు. గోదావరి జిల్లాలను వైసీపీ నుంచి విముక్తి కలిగించాలంటూ తన పర్యటన కొనసాగించారు.
Harish Rao: రైతుబీమా తరహాలోనే కార్మిక బీమా.. లక్ష నుంచి 3 లక్షలకు పెంపు
అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగానే పవన్ జోరు కొనసాగింది. ప్రధానంగా పార్టీకి ఎక్కువ పట్టు ఉన్న గోదావరి జిల్లాలను మొదట ప్రయార్టీగా పెట్టుకోవడం పవన్ కు బాగా కలిసొచ్చింది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ యాత్రను కొనసాగించారు పవన్ కళ్యాణ్. జూన్ 14 న కత్తిపూడి నుంచి ప్రారంభమైన మొదటి విడత టూర్ అదే నెల 30న భీమవరం సభతో ముగిసింది. ఉమ్మడి జిల్లాల్లో పది నియోజకవర్గాలను పవన్ తన మొదటి పర్యటన ద్వారా కవర్ చేసారు. ఇక జూలై 9 న ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభమై 14వ తేదీన తణుకు సభతో ముగిసింది. ఆ తర్వాత చేరికలు,ఇతర కార్యక్రమాల తో వారాహి మూడో విడత యాత్రకు కాస్త గ్యాప్ వచ్చింది.
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు.. నేడే ఆఖరు.. తప్పితే రూ.5000జరిమానా