ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి రోజు. మీరు ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నట్లైతే తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మీరు మీ ITR ఫైల్ చేయడం మిస్ అయితే భారీ నష్టాన్ని చవిచూడవచ్చు. ఈరోజు గడువు ముగిసిన తర్వాత, మీరు ITR ఫైల్ చేసినందుకు భారీగా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈసారి ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం లేదు. ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువును పొడిగించేది లేదని స్పష్టం చేసేసింది.
మీరు మీ ITRని 31 జూలై 2023లోపు ఫైల్ చేయలేకపోతే.. మీరు డిసెంబర్ 31లోపు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే, మీరు దాని కోసం జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎంత జరిమానా చెల్లించవలసి ఉంటుందో తెలుసుకుందాం…..
Read Also:Lord Shiva: ఈ పువ్వుతో శివుడిని పూజిస్తే..కొన్నేళ్లుగా ఉన్న సమస్యలన్నీ దూరం..
జరిమానా ఎంత ఉంటుంది?
జూలై 31 తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే,.. జరిమానాగా రూ. 5,000 చెల్లించాలి. పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే, ఆలస్య రుసుము కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో కూడిన రిటర్న్‌ను ఆలస్యంగా దాఖలు చేసే అవకాశం డిసెంబర్ 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది.
జైలుకు కూడా వెళ్లొచ్చు
పన్ను చెల్లించడం, ఐటీఆర్ దాఖలు చేయడం రెండు వేర్వేరు విషయాలు. మీరు పన్ను విధించదగిన ఆదాయం పరిధిలోకి వస్తే, మీరు ప్రతి సంవత్సరం మీ పన్ను చెల్లించాలి, కానీ మీరు చెల్లించనప్పటికీ, మీరు తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి. పన్ను చెల్లించడమే కాదు, ఐటీఆర్ దాఖలు చేయని పక్షంలో కూడా శిక్ష విధించే నిబంధన ఉంది.
Read Also:David Warner Record: ప్రపంచ రికార్డు నెలకొల్పిన డేవిడ్ వార్నర్!
సెక్షన్ 142(1)(i), లేదా 148 లేదా 153A కింద నోటీసులు పంపబడినప్పటికీ ఒక వ్యక్తి తన ITRని ఫైల్ చేయకపోతే, అతనిపై చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. దీని కింద 3 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండవచ్చు. మీరు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది.