Mustard Benefits : మన వంటగదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి.. మనం చేసే ప్రతి వంటలోనూ ఆవాలను వాడుతూ ఉంటాము. ఆవాలు కూరలకు చక్కటి వాసనను తీసుకురావడంలో సహాయపడతాయి.చాలా మంది ఆవాలను తీసేసి తింటారు.. ఆవాలలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఆవాలలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..
Read Also:Twin Banana: జంట అరటిపండ్లను తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..!
నీటిలో ఆవాలను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు తగ్గుతాయి. శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఆవాల పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు త్వరగా తగ్గు ముఖం పడతాయి. అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఆవాలు మనకు దోహదపడతాయి.. ఇక గాయాలు తగిలినప్పుడు వాటిపై ఆవ పొడిని చల్లితే వెంటనే తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు..
Read Also:World Cup 2023 Tickets: వన్డే ప్రపంచకప్ టికెట్స్ రెడీ.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే!
అదే విధంగా ఆవాలను పేస్ట్ గా చేసి పులిపిర్లపై రాయాలి. ఇలా తరచూ రాయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి. అలాగే వంటల్లో ఆవాలను వాడడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి పెరుగుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అదే విధంగా కొబ్బరి నూనెలో ఆవపొడిని కలిపి జుట్టు రాసుకుని ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడే వారు ఆవ నూనెను తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఇంకా జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఆవాలను ఇప్పటికైనా తినడం అలవాటు చేసుకోండి.. మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి..