YSRCP MP Vijayasai Reddy: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చీఫ్ ఎన్నికల అధికారికి ఏపీలో ఓట్ల గందరగోళంపై పిర్యాదు చేశామని ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. మొత్తం 5 అంశాలపై ఫిర్యాదు చేశామన్నారు.
Read Also: Chandrababu: మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం కలిగింది..
టీడీపీ నేతలు కొన్ని వెబ్‌సైట్‌ల ద్వారా ఓటర్ల వివరాలు నిబంధనలకు విరుద్ధంగా సేకరిస్తున్నారని.. తప్పుడు ఫిర్యాదులు చేసి ప్రభుత్వానికి భంగం కలిగిస్తున్నారని ఆయన అన్నారు. Tdp My party dash board. Com పేరుతో ఓటర్ల అన్ని వివరాలు నమోదు చేశారని, మొబైల్ నంబర్ కూడా చేర్చారని.. గతంలో సేవా మిత్ర పేరుతో డేటా కలెక్ట్ చేశారని ఆయన వెల్లడించారు. 2019లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని.. కానీ కేసులో పురోగతి లేదన్నారు. వివరాల సేకరణలో కులం పేరు కూడా అడుగుతున్నారని.. ఎన్నికల నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని.. ప్రతి 30 ఇళ్ళల్లోని ఓటర్లకు ఒక ఏజెంట్‌ను పెట్టి డేటా కలెక్ట్ చేస్తున్నారన్నారు. లండన్‌లో ఉన్నటువంటి సర్వర్‌లో పొందుపర్చారని.. ఓటర్ల నుంచి సమాచారం సేకరించడం చట్టవిరుద్ధమన్నారు.
Tdp babu surity పేరుతో భవిష్యత్ సురిటి కార్డ్ పేరుతో డేటాను కలెక్ట్ చేశారని ఆయన చెప్పారు. ముందే ప్రామిస్‌లు చేస్తున్నారని.. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న ఓటర్లను మళ్ళీ ఇక్కడ రిజిష్టర్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ఓటర్లను ఏపీలో ఎన్‌రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఒక డ్రైవ్ చేస్తోందని.. ఒక కులానికి, వర్గానికి చెందిన వాళ్ళను ఏపీలో ఎంటర్ చేస్తున్నారన్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళను తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో ఎన్‌రోల్ చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.