తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భగవంతుడు సంకల్పంతో తాను పిఠాపురం వచ్చానని, అధికారం ఉన్నా లేకపోయినా పిఠాపురం ప్రజలు కోసం పని చేస్తానని చెప్పారు. పిఠాపురంలో పక్షి ఈక పడినా ఏదో జరిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరి పిఠాపురంకి వచ్చి గొడవలు చేద్దామనుకుంటే ఏరి వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు. దేశం కోసం పని చేసేవాడిని పండగలకు, పబ్బాలకు రాలేదని అంటున్నారని పవన్ ఫైర్…
శాంతి భధ్రతలపై సమీక్షలో వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. శాంతి భధ్రతల విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా ఉండాలన్నారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే నేరాలను అస్సలు ఉపేక్షించొద్దని చెప్పారు.15 శాతం వృద్ధిరేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదని పవన్ కళ్యాణ్ సూచించారు. ’15 శాతం వృద్ధి రేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం. విశాఖలో కొందరు ఆకస్మికంగా వచ్చి…
చిత్తూరులో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ప్రారంభించారు. పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో 77 డీడీవో ఆఫీసులను ప్రారంభించాం అని, విస్తృతంగా ప్రజలకు సేవలందించడానికి డీడీవో ఆఫీసులు ఉపయోగపడుతాయన్నారు. సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించడానికి ఈ కార్యాలయాలు ఉపయోగపడతాయి పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరు…
Pawan Kalyan: కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు, అది అతని గౌరవం, భద్రత అని జస్టిస్ వి. గోపాల గౌడ నిరూపించారు. కార్మికుడికి రక్షణ, ఒక హైకోర్టు తీర్పుని కొట్టివేస్తూ, కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ తప్పనిసరి అని తీర్పునిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా కర్ణాటక, చిక్కబళ్లాపూర్ జిల్లా చింతామణి పట్టణంలో జస్టిస్ వి.గోపాల గౌడ అమృత మహోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగించారు.
Pawan Kalyan: నేను హైదరాబాదులో జరిగిన ఓజి (OG) సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. OG సినిమాకు దర్శకుడు సుజిత్, సంగీత దర్శకుడు తమన్ నన్ను ఎలా తయారు చేశారంటే.. ఏదో తెల్ల చొక్కా.. జుబ్బా వేసుకొని వచ్చేద్దామంటే లేదండి, బ్లాక్ డ్రెస్ లో రావాలని, కళ్ళజోడు పెట్టుకొని రావాలని అన్నారు. Sujeeth:…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు, సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. సంగీత…
OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఈవెంట్ లో హుషారెత్తించారు. ఆయన ఎంట్రీతోనే ఓజీ లుక్ తో వచ్చారు. కత్తి పట్టుకుని వచ్చి అందరినీ హుషారెత్తించారు. ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎక్కువసేపు మాట్లాడలేదు. సాధారణంగా తన సినిమాల ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎంత లేదన్నా అరగంట మాట్లాడుతుంటారు. అందులో ఎక్కువ సేపు సినిమాలో పాత్రలు, సినిమా ప్రాముఖ్యత గురించే మాట్లాడేవారు. కానీ ఓజీ…
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ తాలూకు కలను తమన్ నిజం చేశాడు. వీళ్లిద్దరూ ఎంత కలిసి పని చేశారంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రిప్ లోకి వెళ్లి, దానిలోకి నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే, నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని ఈరోజు మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే…