Toxic Movie Budget and Remunerations: కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట్ కె.నారాయణతో కలిసి యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుసగా కథానాయికల పాత్రలను పరిచయం చేస్తూ.. పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంతో ప్రేక్షకులలో భారీ బజ్ ఏర్పడింది. ఇక యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది. 2026లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఇప్పటికే ప్రచారం చేయబడుతోంది. టీజర్ విడుదలైన నేపథ్యంలో చిత్రంలోని స్టార్ తారాగణం, వారి పారితోషికం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
‘టాక్సిక్’ సినిమా బడ్జెట్ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించడమే కాదు.. నిర్మాత కూడా. మీడియా నివేదికల ప్రకారం.. యష్ తన పాత్ర కోసం దాదాపు రూ.50 కోట్ల భారీ పారితోషికం తీసుకున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ నదియా పాత్రలో నటిస్తున్నారు. రూ.15 కోట్లు పారితోషికం తీసుకున్నారట. ఇది గత చిత్రాల కంటే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్. లేడి సూపర్ స్టార్ నయనతార గంగా పాత్రను పోషిస్తున్నారు. నయన్ పారితోషికం దాదాపు రూ.12-18 కోట్లు ఉంటుందని అంచనా.
Also Read: Jigris OTT: అమెజాన్ ప్రైమ్‌లో ‘జిగ్రీస్’ సునామీ.. ఇంట్లో అన్-లిమిటెడ్ నవ్వుల జాతరే!
టాక్సిక్ చిత్రంలో రుక్మిణి వసంత్ మెలిస్సా పాత్రను పోషిస్తున్నారు. మెలిస్సా పాత్ర కోసం ఆమె రూ.3-5 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారట. ఎలిజబెత్ పాత్రను చేస్తున్న హుమా ఖురేషి రూ.2-3 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుకున్నారు. టాక్సిక్ సినిమాలో తారా సుతారియా కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు. రెబెక్కా పాత్ర కోసం 2 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, సంయుక్త మీనన్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కూడా నటించారు. ఈ చిత్రం మార్చి 19 థియేటర్లలోకి రానుంది.