Pawan Kalyan: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో జరిగిన బ్లో అవుట్ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ ఘటన వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని జిల్లా కలెక్టర్‌తో పాటు రాజోలు ఎమ్మెల్యేకు స్పష్టమైన సూచనలు చేశారు.ఇరుసుమండ గ్రామ పరిధిలోని మోరి నంబర్ 5 ఓఎన్జీసీ (ONGC) సైట్‌లో గ్యాస్ లీక్ కారణంగా చోటు చేసుకున్న బ్లో అవుట్ ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పరిస్థితిని తెలుసుకున్నారు.
Also Read
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
- Visakhapatnam Earthquake: విశాఖలో భూప్రకంపనలు.. ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన జనం!
- Hyderabad: ఫిలింనగర్లో ఫెరారీ స్పోర్ట్స్ కారు బీభత్సం..
- Shreyas Iyer: "అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం".. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
ప్రమాద ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలను ఖాళీ చేయించినట్లు, అలాగే సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు.ఇదే సమయంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌తో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, పరిసర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సోషల్ మీడియాలో వదంతులు, భయాందోళన కలిగించే ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Off The Record: కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి మళ్లీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం రీస్టార్ట్..!
అలాగే సమీపంలోని కొబ్బరి తోటలకు మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.సహాయక శిబిరాల్లో ఉన్నవారికి అవసరమైన ఔషధాలతో పాటు, శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు కూడా అందించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
-
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!