Capsicum Fry Recipe: క్యాప్సికం (Capsicum) తో తయారు చేసే ఒక చాలా సింపుల్, టేస్టీ అండ్ న్యూట్రిషనల్ ఫ్రై రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. సాధారణంగా మనం క్యాప్సికంని ఫ్రైడ్ రైస్, నూడిల్స్, సాండ్‌విచ్‌లు, రోల్స్ లాంటి వంటల్లో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ క్యాప్సికంతో ఇలా సింపుల్ ఫ్రై చేస్తే, ఎక్కువ పరిమాణంలో క్యాప్సికంని సులభంగా తినవచ్చు. ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉండే శెనగపిండితో తయారవుతుంది. అలాగే క్యాప్సికంలో ఉండే విటమిన్ C వల్ల ఇది మంచి హెల్తీ ఆప్షన్ కూడా. లంచ్ అయినా, డిన్నర్ అయినా, లేదా టైమ్ అస్సలు లేనప్పుడు కూడా ఈ రెసిపీని చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు.
Off The Record: టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఆ నియోజకవర్గం రాజకీయం మారిపోయిందా?
మరి ఈ హెల్తీ సైడ్ డిష్ కు కావలిసిన పదార్థాలు ఏంటంటే..
* క్యాప్సికం – ¼ కిలో (సన్నని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి)
* శనగపిండి – ⅓ కప్పు
* కసూరి మెతి – 1 టీ స్పూన్ (లేకపోతే కొత్తిమీర)
* ధనియాల పొడి – 1 టీ స్పూన్
* కారం – 1 టీ స్పూన్
* పసుపు – ¼ టీ స్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
* ఉల్లి తరుగు – 1 కప్పు
* పచ్చిమిర్చి – 2 (చిన్న ముక్కలుగా)
* కరివేపాకు – 2 రెమ్మలు
* వెల్లుల్లి – కొద్దిగా (క్రష్ చేసి)
* తాలింపు గింజలు: శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి
* ఇంగువ – కొద్దిగా
* గరం మసాలా – ¼ టీ స్పూన్
* కొత్తిమీర – సన్నగా తరిగినది
* నూనె – 2–3 టేబుల్ స్పూన్లు
Bangladesh Hindu Killing: బంగ్లాదేశ్‌లో మరోక హిందూ యువకుడి హత్య..
తయారీ విధానం:
ముందుగా క్యాప్సికంని శుభ్రంగా కడిగి సన్నని స్లైసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్‌లో శనగపిండి, కసూరి మెతి, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. కొద్దిగా నీళ్లు పోస్తూ థిక్ బాటర్ లా కలుపుకుని పక్కన పెట్టండి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ వేసి దోరగా వేయించండి. ఆ తరువాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి.
ఇప్పుడు క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా పసుపు చల్లి, మూత పెట్టి సన్నని లేదా మీడియం ఫ్లేమ్‌లో మగ్గించండి. క్యాప్సికం కలర్ మారే వరకు కుక్ అయిన తర్వాత, ముందుగా తయారు చేసిన శనగపిండి మిశ్రమాన్ని పాన్‌లో స్ప్రెడ్ చేయాలి. వెంటనే కలపకుండా.. మూత పెట్టి సన్నని మంటలో 2–3 నిమిషాలు కుక్ చేయండి. శనగపిండి కొంచెం గట్టిపడిన తర్వాత కలుపుతూ హై ఫ్లేమ్‌లో 2–3 నిమిషాలు బాగా టాస్ చేయండి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే మీ క్యాప్సికం ఫ్రై రెడీ. ఈ క్యాప్సికం ఫ్రై అన్నంతో, సాంబార్ లేదా రసంతో చాలా బాగా కుదురుతుంది. సైడ్ డిష్‌గా కాకుండా ఒట్టిగా తిన్నా కూడా సూపర్‌గా ఉంటుంది. తదుపరి సారి క్యాప్సికం ఉంటే ఈ విధంగా ఫ్రై రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చేసి చూసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయడం మర్చిపోవద్దు.