సంగీత ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా దేశానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్ ‘పార్క్ బో రామ్’ అనుమానాస్పద స్థితిలో గురువారం అర్ధరాత్రి మరణించింది. కేవలం 30 సంవత్సరాలు ఉన్న ఈ పాప్ సింగర్ దక్షిణ కొరియా పాప్ సింగర్ గా ప్రపంచంలో ఎంతో ఫేమస్. ఇకపోతే ఆమె మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. చనిపోయే సమయానికి కొన్ని గంటల ముందు తన స్నేహితులతో ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న ఈమె వారి స్నేహితులతో కలిసి మద్యం తాగింది.
Also read: Ayesha jhulka: పెంపుడు కుక్క కోసం హైకోర్టుకెళ్లిన బాలీవుడ్ భామ.. అసలేం జరిగిందంటే..!
రాత్రి పది గంటల సమయంలో ఆవిడ రెస్ట్ రూమ్ కు వెళ్ళగా ఎంతసేపైనా రాకపోవడంతో ఆమె స్నేహితులు వెళ్లి చూశారు. అయితే అక్కడ అపస్మారక స్థితిలో కనపడటంతో విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే ప్రముఖ పాప సింగర్ ఇక లేరని వార్త తెలియడంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Also read:Nandamuri Balakrishna: సెల్పీ దిగేందుకు యత్నం.. అభిమానిపై మరోసారి చేయి చేసుకున్న బాలయ్య
ఆమెకి 17 ఏళ్ల వయసులోనే 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ కే 2 పాటల పోటీలో పాల్గొని తన టాలెంట్ ను నిరూపించుకుంది. దాంతో వెనక్కి తిరిగి చూడకుండా 2014 తన ‘సింగిల్ బ్యూటిఫుల్’ ఆల్బమ్ రిలీజ్ కావడంతో ఆ ప్రపంచంలో అడుగు పెట్టింది. ఇక అదే సంవత్సరం ‘గావ్ చాట్’ అనే మ్యూజిక్ అవార్డ్స్ లో ‘ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’ గా కూడా అవార్డు గెలుచుకుంది. ఈ సంఘటనతో అభిమానులు ఆమెకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Park Boram has passed away at the age of 30. pic.twitter.com/E2PfluIwfc
— Kpop Charts (@kchartsmaster) April 11, 2024