Damodara Raja Narasimha : వికారాబాద్ జిల్లా పరిగిలో హాస్పిటల్ భవనం నిర్మాణానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, పరిగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద బెడ్ల ఏరియా హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.26 కోట్ల వ్యయం వెచ్చించి, రెండు సంవత్సరాల్లో కొత్త హాస్పిటల్‌ను ప్రజల సేవ కోసం అందుబాటులోకి తెచ్చే దిశగా వారు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. హాస్పిటల్‌లో అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రత్యేకంగా, కిడ్నీ పేషెంట్ల కోసం డయాలసిస్ సెంటర్‌లో బెడ్లు, మిషన్ల సంఖ్య పెంచే ప్రక్రియను ప్రారంభించామన్నారు. హాస్పిటల్‌లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా, రోడ్డు ప్రమాదాలు , ఇతర ఎమర్జెన్సీల్లో ప్రజల ప్రాణాలు కాపాడే సదుపాయాలు అందజేస్తామని చెప్పారు.
Hollywood : భయపెడుతున్న ది కంజురింగ్ లాస్ట్ రైట్స్
అంబులెన్స్ సేవలను మరింత మెరుగుపరచేందుకు, కొత్త అంబులెన్స్‌లు తీసుకురావడంపై దృష్టి పెట్టిన మంత్రి, ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైమ్‌ను పది నిమిషాలకు తగ్గించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవలే 213 కొత్త అంబులెన్స్లను గౌరవ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని, భవిష్యత్తులో మరిన్ని అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చే వాగ్దానం చేశారు. పరిగిలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేసే దిశగా పరిశీలన చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గతేడాది 16 కొత్త నర్సింగ్ కాలేజీలను ప్రారంభించడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నర్సింగ్ విద్యను అందించడం, యువతకు దేశం , విదేశాలలో ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ప్రోత్సహించడం జరుగుతోందని చెప్పారు. 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసినట్లు, మరో 2300 పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానున్నట్లు వెల్లడించారు.
హెల్త్ క్యాంపెయిన్లు నిర్వహించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్‌సీడీ (నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్) క్లినిక్స్ ఏర్పాటు చేయడం, అలాగే 4 రీజనల్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటు పై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. ప్రజలు తమ ఆహార అలవాట్లను సరిదిద్దుకుని, వ్యాయామం చేయడం ద్వారా వ్యాధుల నుండి రక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటళ్ల రూపురేఖలను మార్చి, వాటిని ఆకర్షణీయంగా , పేషెంట్లకు సౌకర్యవంతమైన వాటిగా మారుస్తామని, ఈ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించబడతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందరె రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
US-China Tariffs: హమ్మయ్య.. అమెరికా, చైనా మధ్య కుదిరిన సుంకాల ఒప్పందం..!