హాలీవుడ్ చిత్రాల్లో అత్యంత భయానకమైన హారర్ మూవీ ది కంజురింగ్. ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన సిరీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అతీంద్రియ శక్తులు, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్టుతో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది ది కంజురింగ్. 2013లో స్టార్టైన ది కంజురింగ్ యూనివర్శ్ నుండి ఇప్పటికి ఎనిమిది సినిమాలొచ్చాయి. అన్ని సిరీస్ లు ఒకదానికి మించి ఒకటి అదరగోట్టాయి. ఇప్పుడు తొమ్మిదో ఇన్ స్టాల్ మెంట్ మూవీ తీసుకురాబోతున్నారు మేకర్స్. ది కంజురింగ్ లాస్ట్ రైట్స్‌తో వస్తున్న ఈ సినిమాతో ఈ ఫ్రాంచైజీ చిత్రాలకు ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది.
ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ టీజర్ రిలీజ్ ను ఇటీవల రిలీజ్ చేసారు మేకర్స్. ఇది ది కంజురింగ్ ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్ సీక్వెల్‌గా తీసుకు వస్తున్నారు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్ అండ్ లోరైన్ వారెన్ చివరి ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎంగేజింగ్‌గా మరింత హార్రిబుల్‌గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమౌతుంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అమెరికన్ మార్కెట్‌తో పాటు ఇండియన్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది ఈ బొమ్మ. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ చిత్రాలు ఇండియా మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపడం లేదు. గత ఏడాది వచ్చిన ముఫసా రీసెంట్లీ వచ్చిన మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి వచ్చిన థండర్ బోల్ట్ వరకు ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఒకప్పటి మ్యాజిక్ చేయలేకపోయాయి. మరి ది కంజురింగ్ ఫ్రాంచైజీ నుండి వస్తోన్న ఆఖరు మూవీ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.