అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్.. 113 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తాన్ 113 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ కూడా 113 పాయింట్లతోనే ఉండటం గమనార్హం.