Asim Munir Promotion: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కేబినెట్ ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్‌ను ఫీల్డ్ మార్షల్ పదవికి ప్రమోట్ చేసింది. నిజానికి ఇది దేశ చరిత్రలో ఇలా చేయడం రెండోసారి మాత్రమే. ఇదివరకు 1959లో మహ్మద్ అయూబ్ ఖాన్‌కు ఈ పదివిని ఇచ్చారు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన “ఆపరేషన్ సిందూర్” సైనిక సంఘర్షణలో మునీర్ పాత్రను ఈ ప్రమోషన్‌కు కారణంగా పేర్కొంది పాక్ ప్రభుత్వం. అయితే, ఈ యుద్ధంలో పాకిస్తాన్‌కు ఓటమి ఎదురయ్యినప్పటికీ కేవలం 10 రోజుల్లోనే ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు.
Read Also: China- Pakistan: భారత్ పాక్ ఉద్రిక్తత మధ్య.. పాకిస్థాన్, చైనా మధ్య కీలక ఒప్పందం..
https://twitter.com/ImtiazMadmood/status/1924936112453083313
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇందులో భాగంగా కొందరు “ప్రమోషన్ కాదు, స్వయంగా తీసుకున్న హోదా” అంటూ చాలామంది విమర్శించారు. సైనిక పరాజయాల తర్వాత కూడా ఇలా ప్రోత్సహించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. భారత ఆర్మీ పెద్దఎత్తున పాక్ డ్రోన్లను నాశనం చేయడంతో పాటు పాక్ ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఈ ప్రమోషన్‌కి గట్టి వ్యతిరేకతను వ్యక్తపరిచారు.
Read Also: Honda X-ADV: అడ్వెంచర్ రైడింగ్‌కు అనుగుణంగా స్టైలిష్ లుక్ తో X-ADV లాంచ్..!
Failed Marshal rank 😂😂 pic.twitter.com/lytX0tkj3x
— Meme Farmer (@craziestlazy) May 21, 2025
జనరల్ ఆసిం మునీర్ చేసిన మతరూపమైన, రెచ్చగొట్టే ప్రసంగం వల్లే భారత్‌లోని పహల్గాం ప్రాంతంలో తీవ్రవాద దాడి జరిగిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు హతమయ్యారు. మత విశ్వాసం నిరూపించలేదన్న కారణంతోనే ఈ దాడి జరిగిందని కొందరు తప్పుబడుతున్నారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ బాధ్యత వహించింది. దీనికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలు మిసైల్ దాడులతో నాశనం చేయబడ్డాయి. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. మొత్తం మీద పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వారి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమర్శలకు గురవుతోంది.