పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార దాడులకు దిగింది. దౌత్యదాడితో పాటు మిస్సైల్స్ దాడితో పాక్ ను వణికిస్తోంది. అయితే ఈ ఉద్రిక్తతలకు, యుద్ధానికి ఉసిగొల్పింది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మున్నీర్ అనడంలో సందేహం లేదు. పాకిస్తానీ జీహాది జనరల్. సైన్యం పరంగా, ఆర్థికంగా పాక్ భారత్ తో పోటీపడలేని పాక్ మొండిగా యుద్ధంలోకి దిగడం ఎవరూ ఊహించలేదు. అప్పుల్లో కూరుకుపోయి ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని అడుక్కుని పూట గడుపుతున్న పాక్ యుద్ధాన్ని ఎందుకు కోరుకుందంటే అందుకు ఒకే ఒక్క సమాధానం ఆసిఫ్ మున్నీర్. ఆ దేశ సైన్యాధ్యక్షుడు.
Also Read:IndiaPakWar: టర్కీ డబుల్ గేమ్.. పాక్కి డ్రోన్ల సరఫరా.. పహల్గామ్ మృతులకు సంతాపం
ఆసిఫ్ మున్నీర్ ను అరెస్టు చేశారంటూ.. ఆర్మీ జనరల్స్ తిరుగుబాటు చేశారంటూ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అతన్ని త్వరలో సైన్యాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, పాక్ ప్రజెంట్ పరిస్థితి చూస్తుంటే అతన్ని తప్పించడం ఎవరి వళ్ల కాదు. ఎందుకంటే అతడు సైన్యంపై అంతలా పట్టుసాధించాడు. పదవీ నుంచి తొలగిస్తారో లేదో వేరే సంగతి. కానీ, పాక్ యుద్ధ భూమిలో అడుగుపెట్టడానికి కారణం మాత్రం ఆసిఫ్ మున్నీరే. ఆసిఫ్ మున్నీర్ పాకిస్తాన్ జిహాద్ జనరల్ నరనరాన భారత్ పై విధ్వేశం, హింధువులపై కసినింపుకున్న కరుడుగట్టిన పాకిస్తాని. ఐఎస్ఐ ఛీఫ్ గా, మిలటరీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన తొలి ఆర్మీ ఛీఫ్ ఇతడే. భారత్ లో పలు ఉగ్రదాడులకు తెర వెనక సూత్రధారి ఇతడే.
Also Read:Pakistani Drone Strike: పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడి.. భారీగా ఇళ్ళు, కార్లు ధ్వంసం!
గతంలో ఐఎస్ఐ ఛీఫ్ గా పనిచేసినపుడే పూల్వామా ఎటాక్ కు ప్లాన్ చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నాడు. తాజాగా పహల్గాం ఘటనలో 26 మందిని చంపడంలో సూత్రదారి ఆసిఫ్ మునీర్. ఏప్రిల్ 16న కాశ్మీర్ పై అతడు చేసిన వ్యాఖ్యలు పహల్గాం దాడి వెనక అతడి పాత్రను స్పష్టం చేస్తున్నాయి. పాక్ సైన్యం మొత్తం ప్రస్తుతం మున్నీర్ చేతుల్లోనే ఉంది. 2018లో ఐఎస్ఐ ఛీఫ్ గా ఇమ్రాన్ ఖాన్ ఆసిఫ్ మునీర్ ను నియమించారు. అయితే ఇమ్రాన్ భార్య అవినీతిని మునీర్ బయటపెట్టి కలకలం రేపాడు. దీంతో పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత సంకీర్ణ సర్కార్ ఏర్పడ్డాక సైన్యాధ్యక్ష భాద్యతలను తీసుకుని ఇమ్రాన్ ను జైలుకు పంపి పగతీర్చుకున్నాడు మునీర్. మొదట కాస్త వెనకడుగు వేసినట్లు కనిపించినా తర్వాత సైన్యంపై పట్టుబిగించాడు. తన మనుషులను కీలక స్థానాల్లో నియమించాడు.
నెమ్మది నెమ్మదిగా రాజకీయ వ్యవస్థపై పట్టుబిగించాడు మునీర్. ఇప్పుడు పాకిస్తాన్ లో అతడు చెప్పిందే ఫైనల్. భరించలేమని తెలిసినా యుద్ధ భూమిలో పాక్ యుద్ధానికి సై అనడానికి కారణం ఆర్మీ ఛీఫే. ఉగ్రదాడికి దిగితే భారత్ ఎదురుదాడికి దిగుతుందని పాక్ కు తెలుసు. దాన్ని తాము భరించలేమని కూడా వారికి తెలుసు. అయినా పాక్ యుద్ధానికి వెల్లడానికి కారణం ఆసిఫ్ మునీర్. అతన్ని ఆపే ధైర్యం పాక్ అధ్యక్షుడికి లేదు. ప్రధానికి లేదు, రక్షణ మంత్రికి లేదు. జనరల్ జియాఉల్ హక్ తర్వాత ఇస్లామిక్ నేషనలిజం నినాదం ఎత్తుకున్న వ్యక్తి మున్నీర్. అతను చదువుకున్నదే మదర్సాలో. అందుకే భారత్ పై అంత వ్యతిరేఖత.
Also Read:Indian Official Killed: పాక్ దాడుల్లో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మృతి.. స్పందించిన సీఎం ఒమర్!
పాక్ సైనికాధికారులు ఎక్కువగా పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ నుంచి వస్తే మునీర్ మాత్రం ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుంచి రిక్రూట్ అయి క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చారు. ఐఎస్ఐ ఛీఫ్ గా మిలటరీ ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసిన అనుభవం ఉండడంతో వ్యూహాలు పన్నడంలో దిట్ట ఆసిఫ్ మునీర్. భారత్ సింధూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలగగానే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటంచడం వెనక ఉన్నది మునీరే. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహాలు రచించడంలో మునీర్ ముందుంటారు. అందుకే అతడిని అంత ఈజీగా తీసుకోవద్దని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓటమి తప్పదని తెలిసినా భారత్ తో కయ్యానికి కాలుదువ్వడానికి మునీర్ మాస్టర్ ప్లాన్ ఉందని కొందరు పాక్ నేతల అనుమానం. ఓటమి తర్వాత అందుకు బాధ్యులుగా పాక్ రాజకీయ వ్యవస్థను చూపించి తాను తిరుగుబాటు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆర్టిక్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో ప్రశాంత పరిస్తితులు నెలకొనడం మునీర్ కు ఇష్టం లేదు. అదే జరిగితే తన లక్ష్యం నెరవేరదు. అందుకే కాశ్మీర్ లో మళ్ళీ అలజడి రేపాడు. మునీర్ పదవీకాలం మరో రెండేళ్లు ఉంది. ఈలోపు అతడి నుంచి మరిన్ని కుట్రలు చూడాల్సి ఉంటుందో అని ఆందోళన వ్యక్తమవుతోంది.