Operation Sindoor : సరిహద్దుల్లో భారత సైన్యం పంజా.. ఉగ్ర స్థావరాలు, డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లు నేలమట్టం..
- జమ్మూ సరిహద్దులో ఉగ్ర స్థావరాలపై దాడి
- ట్యూబ్-లాంచెడ్ డ్రోన్‌లకు అంతరాయం
- భద్రత కోసం భారత సైన్యం మెరుపుదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor : జమ్మూ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, భారత సైన్యం మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్తాన్ వైపు నుండి ఉగ్రవాదుల చొరబాట్లు, ముఖ్యంగా ట్యూబ్-లాంచెడ్ డ్రోన్‌ల ప్రయోగానికి వినియోగించిన పాకిస్తానీ పోస్టులు , ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను భారత సైన్యం సమర్థవంతంగా ధ్వంసం చేసినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం , ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. ముఖ్యంగా, జమ్మూ సమీపంలోని సరిహద్దు ప్రాంతాల నుండి ట్యూబ్-లాంచెడ్ డ్రోన్‌లను ఉపయోగించి భారత భూభాగంలోకి గూఢచర్యం , దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీనిపై అప్రమత్తమైన భారత సైన్యం, పకడ్బందీ ప్రణాళికతో ఈ స్థావరాలపై దాడికి దిగింది.
Operation Sindoor: పాక్ వ్యాప్తంగా భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్‌లో, ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారిన పలు పాకిస్తానీ పోస్టులు , సరిహద్దుకు సమీపంలో ఉన్న లాంచ్ ప్యాడ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ స్థావరాల నుండే ట్యూబ్-లాంచెడ్ డ్రోన్‌లను ప్రయోగించి భారత భూభాగంలోకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. భారత సైన్యం ఈ మెరుపుదాడితో శత్రువులకు భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత సైన్యం అత్యవసర మీడియా సమావేశం..
ఈ విజయం సరిహద్దుల్లో భారత సైన్యం సంసిద్ధతను, , దేశ భద్రతను కాపాడటంలో వారి నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది. డ్రోన్‌లు వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి శత్రువులు సృష్టిస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలో భారత సైన్యం సామర్థ్యానికి ఇది నిదర్శనం. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడానికి, , ఎటువంటి దుశ్చర్యలనైనా తిప్పికొట్టడానికి భారత సైన్యం అప్రమత్తంగా ఉందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!