Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సవరణ లక్ష్యం ఏమిటంటే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ పదవీకాలం, చట్టపరమైన హోదా చుట్టూ ఉన్న అస్పష్టతను తొలగించడం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించిన విషయం తెలిసిందే. అయితే మునీర్ ఈ పదవి నుంచి అధికారికంగా నవంబర్ 28, 2025న…
అసిమ్ మునీర్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. భారత్‌పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పహల్గామ్ ఉగ్ర దాడికి ఆద్యుడు. కాశ్మీర్‌పై రెచ్చగొట్టిన ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
Asim Munir: పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ యాక్టివ్‌గా మారారు. పౌర ప్రభుత్వాన్ని కాదని ఆయనే అన్ని దేశాల పర్యటకు వెళ్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అసలు నిజమైన పాలకుడా..? కాదా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల, షరీఫ్‌ని పక్కన పెట్టేందుకు మునీర్ ప్రయత్నిస్తు్న్నాడనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఇదే జరిగితే, మరోసారి పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ కిందకు వెళ్లే అవకాశం…
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం.. ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్‌కు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు. అంతేకాకుండా ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రం అని కూడా తెలుసు. అంతేకాకుండా చైనాకు పాకిస్థాన్ మిత్ర దేశం. ఇన్ని పరిణామాల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో అమెరికాలో పర్యటిస్తున్నారు. అసిమ్ మునీర్ రెచ్చగొట్టడంతోనే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Asim Munir: అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లో జరుగుతున్న మిలిటరీ పరేడ్‌కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ని అమెరికా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను అమెరికా తోసిపుచ్చింది. ఇది తప్పుడు వార్త అని, విదేశీ సైనిక నాయకులను ఎవరూ ఆహ్వానించలేదు అని వైట్ హౌజ్ అధికారి ఒకరు చెప్పినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ పేర్కొంది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇక టర్కీ రాజధాని అంకారాలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార దాడులకు దిగింది. దౌత్యదాడితో పాటు మిస్సైల్స్ దాడితో పాక్ ను వణికిస్తోంది. అయితే ఈ ఉద్రిక్తతలకు, యుద్ధానికి ఉసిగొల్పింది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మున్నీర్ అనడంలో సందేహం లేదు. పాకిస్తానీ జీహాది జనరల్. సైన్యం పరంగా, ఆర్థికంగా పాక్ భారత్ తో పోటీపడలేని పాక్ మొండిగా యుద్ధంలోకి దిగడం ఎవరూ ఊహించలేదు.…
Asim Munir: ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ..? అనే ప్రశ్న అందరితో మెదులుతోంది. మీడియాలో వస్తు్న్న వార్తల ప్రకారం, ఆసిమ్ మునీర్‌ని ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ఉద్రిక్తతకు కారణం మాత్రం ఆసిమ్ మునీరే. ఆయన చేసిన విద్వేష ప్రసంగం తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. హిందూ-ముస్లింలు వేరని హిందువుల పట్ల, భారత్ పట్ల ద్వేషాన్ని…