పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా మరణం పట్ల పాకిస్థాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) సింధ్ యూనిట్ సంతాప సమావేశం నిర్వహించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఒక అగ్ర ఉగ్రవాది హతమయ్యాడు. లష్కర్ ఉగ్రవాది అల్తాఫ్ లాలిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి బండిపోరాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.