OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- అసెంబ్లీ సమావేశాల ఆఖరు రోజున 22Aపై చర్చ
- సందేహాలు నివృత్తి చేస్తూ మంత్రి పొంగులేటి ప్రజెంటేషన్
- సుదీర్ఘ క్లారిఫికేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
- అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణపై క్లారిటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరిందా? కాస్త అటు ఇటుగా…. ఫలానా టైంలో చేసేద్దామని పార్టీ పెద్దల మధ్య చర్చ జరుగుతోందా? రాజకీయ యుద్ధానికి వేదిక అవుతున్న అసెంబ్లీ సమావేశాలు మిగిసిన వెంటనే కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేస్తారా? ఆశావహులు ఆల్రెడీ ఢిల్లీ విమానాలు ఎక్కేశారన్నది నిజమేనా? ఉంటే గింటే ఎప్పుడు ఉండవచ్చు కేబినెట్ విస్తరణ? దాని గురించి కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరి అటెన్షన్ ఉన్న 22a పై ఆఖరు రోజున చర్చించబోతోంది ప్రభుత్వం. ఆ సందర్భంగానే… అన్ని రకాల వివరాలను బయటపెట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఆ భూములకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేస్తూ… రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు.
అలాగే…. సీఎం రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘంగా క్లారిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రతిపక్షం బీఆర్ఎస్ పదేపదే ఇదే అంశాన్ని ప్రస్తావించిన క్రమంలో… దానిపై కొంత అటెన్షన్ వచ్చింది. కానీ… ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం సభలో లేదు. అయినాసరే… అపోజిషన్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పడంతో పాటు గట్టిగా టార్గెట్ చేస్తూ వివరాలన్నింటిని బయట పెట్టాలని డిసైడ్ అయ్యిందట ప్రభుత్వం. అదంతా ఒక ఎత్తయితే… అసెంబ్లీ సమావేశాలు ముగిశాక క్యాబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు పార్టీ నాయకులు. అసెంబ్లీ సమావేశాల తర్వాత క్యాబినెట్ విస్తరణ పై క్లారిటీ వస్తుందని చాలామంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. ఆశావాహులు ఇప్పటికే హస్తిన వెళ్లి ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారట. ప్రభుత్వంలో ఇప్పుడు మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ మూడింటిని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు భర్తీ చేస్తారా….అంటూ ఎప్పటికప్పుడు ఎదురు చూస్తున్నారు, రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన వెంటనే విస్తరణ ఉంటుందని భావించారు.
Also Read
అయితే… ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ముగింపునకు సమయం దగ్గర పడటంతో అందరి అటెన్షన్ విస్తరణ మీదికి మళ్లుతోంది. ఈక్రమంలోనే… దసరా లోపు ఆ పని పూర్తి కావచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ వర్గాల నుంచి. దసరా కానుకగా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఆశావహులందరికీ ఇండికేషన్స్ వెళ్తున్నాయట. అయితే… ఆ లోపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. సామాజిక సమీకరణలతో పాటు అధిష్టానంతో మరోసారి చర్చించాల్సి ఉంటుంది. ఆ సంగతులు ఎలా ఉన్నా… మంత్రి పదవిపై హాజరు పెట్టుకున్న నాయకులకు దసరాలోపు గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మీదనే ఫోకస్ చేశారు. అవి గనుక ముగిస్తే… ఇక దృష్టి మొత్తం కేబినెట్ మీదికే మళ్లుతుందని చెప్పుకుంటున్నారు. అయితే…. దసరాకి, లేదంటే ఆలోపే విస్తరణ ఉండే అవకాశం ఉండవచ్చన్న ప్రచారం మాత్రం కాంగ్రెస్ నేతల్ని ఊరిస్తోంది.
తాజావార్తలు
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
-
New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?