తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బనకచర్ల అంశం, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని పేర్కొన్నారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదనిమండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజంటేషన్‌లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ సచ్చిన పామే అయితే.. పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యమని…
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ పాలసీ రేపటి నుంచి (నవంబర్ 18) 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో…
జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటీవల వరుస హత్యల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి వేళలో గస్తీ పెంచారు రాత్రిలు వాహనం మీద తిరుగుతున్న వారిని ఆపి వివరాలు తీసుకుంటున్నారు . వాహనాలు తనిఖీ చేస్తున్నారు . సరైన సమాధానం చెప్పని వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు .ద్విచక్ర వాహనాలపై గుంపులుగా సంచరిస్తున్న వారిని, సమయానికి మించి దుకాణాలు నిర్వహిస్తున్న యజమానులను పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్‌లు ఇంకా కొనసాగుతుంటాయని అదనపు డీసీపీ…
సైన్స్ పెరుగుతున్నా కూడా జనాల్లో మూఢ నమ్మకాలు కూడా పెరుగుతున్నాయి.. అలాంటివి చెయ్యొద్దు అంటున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. ఇప్పుడు ఎందుకు ఇది చెబుతున్నాం అంటే తాజాగా తెలంగాణ లో ఓ ఆచారం ఉంది.. మగవారి కోసం.. ఊరి చివరకు వెళ్లి చీపుర్లు, చెప్పుల తో వాళ్లను వాళ్ళే కొట్టుకుంటారు.. అనంతరం ఆ బట్టలు విప్పేసి అక్కడే పడేసి ఇంటికి వస్తారు.. ఈ ఆచారం తెలంగాణ లోని జగిత్యాల లో వెలుగు చూసింది.. వివరాల్లోకి…
తెలంగాణ మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.