LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LG స్మార్ట్ఫోన్లు, టీవీల వినియోగం పెరుగుతున్న తరుణంలో, ఎల్జి (LG) స్మార్ట్ టీవీలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఒక కొత్త నివేదిక యూజర్ల ప్రైవసీపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. టెక్ రీసెర్చర్లు నుంచి సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అందించిన వివరాల ప్రకారం.. కొన్ని ఎల్జి టీవీలు హోమ్ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడిన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఇతర డివైజెస్‌ను గుర్తించగలవని తేలింది. అంతేకాకుండా, ఒక సెక్యూరిటీ లొసుగు కారణంగా టీవీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, స్టాండ్‌బై మోడ్‌లో ఉన్న సమయాల్లో కూడా ఆడియో రికార్డు కావచ్చనే వాదనలు వినిపించాయి. ఈ రీసెర్చ్ ప్రకారం.. టీవీలు చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వై-ఫై నెట్వర్క్ పేర్లు, సిగ్నల్ వివరాలను కూడా సేకరించగలవు. ఈ డేటాను వ్యూయింగ్ డేటా, అడ్వర్టైజింగ్ ఐడీలతో జతచేసి యూజర్ల ప్రవర్తనను ట్రేస్ చేయవచ్చు.
టీవీలో రన్ అయ్యే కంటెంట్‌ను గుర్తించడానికి ఉపయోగించే ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్ (ACR) టెక్నాలజీ కూడా ఈ చర్చలో కీలకంగా మారింది. దీని ద్వారా ప్రోగ్రామ్‌లు, యాడ్స్‌ను పసిగట్టవచ్చు. అయితే దీనిపై ఎల్జి స్పందిస్తూ.. ఏసీఆర్ అనేది పూర్తిగా యూజర్ ఆప్షన్ అని, అనుమతి లేకుండా ఆ డేటాను వాడమని స్పష్టం చేసింది. స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఆడియో రికార్డింగ్ జరగడంపై వస్తున్న వాదనలను ఎల్జి పూర్తిగా ఖండించింది. రిమోట్లోని వాయిస్ బటన్ నొక్కినప్పుడు, ‘హాయ్ ఎల్జి’ అనే వేక్ వర్డ్ ఉపయోగించినప్పుడు మాత్రమే వాయిస్ డేటా ప్రాసెస్ అవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. వేక్ వర్డ్ కోసం ఉపయోగించే ఆడియో డివైస్‌లోనే ఉంటుందని, ఎలాంటి అనధికార రికార్డింగ్స్ జరగవని పేర్కొంది. స్థానిక నెట్‌వర్క్‌లోని ఇతర డివైజెస్‌ను స్కాన్ చేయడం అనేది కనెక్టివిటీ కోసం ఉపయోగపడే సాధారణ ఫీచర్ అని ఎల్జి వివరణ ఇచ్చింది.
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
యూజర్లు తమ సెక్యురిటీని కాపాడుకోవడానికి టీవీ ప్రైవసీ సెట్టింగ్స్‌ను చెక్ చేసుకోవడం ముఖ్యం. ఏసీఆర్, పర్సనలైజ్డ్ యాడ్స్, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లను అవసరం లేకపోతే డిసేబుల్ చేసుకోవచ్చు. టీవీని గెస్ట్ వై-ఫై నెట్‌వర్క్‌లో ఉంచడం ద్వారా భద్రతను మరింత మెరుగుపరచుకోవచ్చు. ఎల్జి తన డివైజెస్‌లో యూజర్లకు పూర్తి ప్రైవసీ కంట్రోల్ ఇస్తామని, సెక్యూరిటీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటామని భరోసా ఇస్తోంది.
తాజావార్తలు
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?