OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.. తన గురించి మరో నిజం బయటకు వచ్చింది.. సామ్ ఆల్ట్‌మాన్ తన స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది..
బుధవారం హవాయిలో జరిగింది. వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్, అలెగ్జాండర్ వాంగ్, షెర్విన్ పిషెవర్, జేన్ మతోషి, అడ్రియన్ ఔన్ ఉన్నారు.. ఆల్ట్‌మాన్ జీవిత భాగస్వామి ఆలివర్ ముల్హెరిన్‌ను ఒల్లీ అని కూడా పిలుస్తారు. సామ్,ఆలివర్ ల స్నేహం చాలా పాతదే. ఆలివర్ ముల్హెరిన్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు.. ఆ రోజుల్లోనే ఎన్నో ప్రాజెక్ట్స్ ను చేశారు..
గతేడాది వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో వీరిద్దరూ తొలిసారి జంటగా కనిపించారు. సామ్ ఆల్ట్‌మన్, ఆలివర్ ముల్హెరిన్ మధ్య స్నేహం చాలా పాతదదే. వీరి వివాహ వేడుక ఆల్ట్‌మన్ నివాసంలో ఆడంబరాలకు దూరంగా సాధారణ వేడుకలా జరిగింది. వీరిద్దరి వివాహ వేడుకకు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.. ఈ పెళ్లికి ప్రముఖులు కూడా హాజరయ్యారని తెలుస్తుంది.. ఇదేంటి అతను గే నా అనే సందేహాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.. ఏంటో ఇది ఇంకా అర్థం కానీ ప్రశ్నలాగే మిగిలి ఉంది..