జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి కమల ప్రసన్న నగర్ ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది ..ఇంట్లో నివాసముండే జయకృష్ణ 35 అనే వ్యక్తి మంటల్లో కాలిపోయాడు. స్థానికులు… పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి మొదటి అంతస్తులు మంటలు చిలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఒక ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పి వేశారు. అప్పటికే జయ కృష్ణ మృతి చెందాడు.. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు . మృతుడు స్థానికంగా జిమ్ కోచ్ గా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు ..వీరందరూ భీమవరంలో ఉన్నారు.. జయ కృష్ణకు మద్యం ఎక్కువగా తీసుకుంటాడని బంధువులు తెలుపుతున్నారు .అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా లేక అగ్నిప్రమాదం వల్ల అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు..
Also Read : Extramarital Affair: ఒకరితో వివాహేతర సంబంధం.. మరొకరితో చనువు.. కట్ చేస్తే!