Srikakulam Woman Killed For Having Affair With Two Boys: ఆమెకు 40 సంవత్సరాలు. మంచి భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నా.. ఆ మహిళ మాత్రం దారి తప్పింది. ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. ఆ వివాహేతర సంబంధం ఆమెను బలి తీసుకుంది. ఆమెతో పాటు ఓ యువకుడు కూడా ఈ వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
Etela Rajender : ఓరుగల్లు మొదటి నుంచి చైతన్యానికి మారు పేరుగా నిలుస్తుంది
కోదడ్డపనస గ్రామానికి చెందిన వెలమల ఎర్రమ్మ (40) అనే మహిళకు 18 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన భాస్కరరావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కట్ చేస్తే.. ఎర్రమ్మ వరుసకు మరిది అయ్యే ముద్దాడ రామారావు (30)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరికీ తెలియకుండా అతనితో రహస్యంగా ఎఫైర్ కొనసాగిస్తోంది. అంతేకాదు.. కొంతకాలం నుంచి ముద్దాడ సంతోష్ (26) అనే మరో యువకుడితోనూ ఆమె చనువుగా ఉంటోంది. ఈ విషయం ఇటీవల రామారావుకి తెలిసింది. అప్పటి నుంచి అతడు ఎర్రమ్మ, సంతోష్‌పై పగ పెంచుకున్నాడు. తనతో పాటు సంతోష్‌తోనూ ఎర్రమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో.. ఇద్దరినీ మట్టుబెట్టాలని రామారావు నిర్ణయించుకున్నాడు.
TS SSC Results : 10th పేపర్ లీకేజీ కేసు.. హోల్డ్‌లో విద్యార్థి హరీష్ రిజల్ట్
పక్కా ప్లాన్ ప్రకారం.. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న ఒక కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను రామారావు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత అదే కత్తితో.. సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మపై కూడా దాడి చేశాడు. విచక్షణారహితంగా అతడు కత్తితో దాడి చేయడంతో.. ఎర్రమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి పరారైన రామారవు.. అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. విగతజీవిగా పడివున్న రామారావుని చూసి, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వివాహేతర సంబంధమే ఈ జంట హత్యలకు కారణమని తేల్చారు.