Suhas – JanakaAitheGanaka : షార్ట్ మూవీ ఫిలిమ్స్ లో తన నటనను ప్రూవ్ చేసుకొని.. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుహాస్ మొదట్లో డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ నటనపరంగా మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా హీరో సుహాస్ నటించబోతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ ను మూవీ మేకర్స్ అనౌన్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు.
Mokshagna: పాన్ ఇండియా డెరైక్టర్ తో మోక్షు లాంఛ్.. సంబరాలకు సిద్ధం కండి!
ఈ సినిమాకు ” జనక అయితే గనక ” (Janaka Aithe Ganaka) అంటూ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఇందుకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను రిలీజ్ సోషల్ మీడియా వేదికగా చేశారు. ఈ పోస్టర్ లో హీరో సుహాస్ తలను పట్టుకున్నట్లుగా కనపడుతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ” ఆనందం పట్టలేనంత.. బాధలు చెప్పుకోలేనంత.. నవ్వులు ఆపుకోలేనంత.. ” అనే విధంగా ఉంటుందని మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ విషయం బట్టి ఆలోచిస్తే.. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నట్లు అర్థమవుతుంది.
Vijay Varma : అందుకే ‘మగడినయ్యా’.. తమన్నా బాయ్ ప్రెండ్ ను ఆడేసుకుంటున్న నెటిజన్స్..
సుహాస్ సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జూలై 4న ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులు ఆ సినిమా టీజర్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.