Oil Tanker Capsized: ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ లీకై డ్రైనేజీల్లో ప్రవహించటంతో మంటలు అంటుకున్నాయి. స్థానిక పెట్రోల్ బంక్ ప్రాంతంలో టైర్ షాప్‌కి కూడా మంటలు వ్యాపించాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంతో నూజివీడు-హనుమాన్ జంక్షన్ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also: GunFire : ఓహియో రాజధాని కొలంబస్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి..ముగ్గురికి గాయాలు
ఆయిల్ ట్యాంకర్ బోల్తా ఘటనలో భద్రత చర్యలు కొనసాగుతున్నాయి. ఆయిల్ లీకై డ్రైనేజీల్లో రోడ్లపై ప్రవహించటంతో రాత్రి 12 గంటల వరకు మంటలు ఎగిసిపడ్డాయి. రెండు ఫైర్ ఇంజన్లతో పోలీస్ , రెవిన్యూ , అగ్నిమాపక సిబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.