RRB Group D Recruitment 2025: రైల్వేలో 32000 గ్రూప్ D పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడింది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 (గ్రూప్ D) రిక్రూట్మెంట్ ను వెలువడించింది. RRB సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ (CEN) నం. 08/2024 ప్రకారం, వివిధ స్థాయి-1 దాదాపు 32000 పోస్ట్‌లపై రిక్రూట్మెంట్ ఉంటుంది. దీని ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 23 జనవరి 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 22 ఫిబ్రవరి 2025గా నిర్ణయించబడింది. దీని ప్రకారం, వయస్సు 01.07.2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక రిజర్వేషన్స్ ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. గత నెలల్లో జరిగిన వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్‌ల మాదిరిగానే, గరిష్ట వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ప్రస్తావన కూడా ఉంది. కోవిడ్ మహమ్మారి కారణంగా, గరిష్ట వయో పరిమితిని మూడేళ్లపాటు సడలించారు. గరిష్ట వయోపరిమితి 33కి బదులుగా 36 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఈ మినహాయింపు ఒక్క సారి మాత్రమే. ఇకపోతే పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రచురించిన షార్ట్ నోటీసులో పేర్కొనలేదు.
Also Read: IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించగలదా?
10వ తరగతి ఉత్తీర్ణత లేదా NCVT సర్టిఫికేట్ ఉన్నవారు రైల్వే గ్రూప్ D రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. దరఖాస్తు చేయడానికి, జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి (CBTలో హాజరైనట్లయితే రూ. 400 వాపసు ఇవ్వబడుతుంది). అలాగే SC/ST/EBC/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు రూ. 250 చెల్లించాలి. (CBTలో హాజరైనట్లయితే పూర్తి రుసుము తిరిగి చెల్లించబడుతుంది).
Also Read: Bandi Sanjay: ఆర్‌ఆర్‌ఆర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం..