Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record On Tdp Vs Bjp

Off The Record : మనమేంటి.. మన రేంజ్ ఏంటి.. బీజేపీతో పొత్తేంటి

Published Date :June 16, 2023 , 10:24 pm
By Gogikar Sai Krishna
Off The Record :  మనమేంటి.. మన రేంజ్ ఏంటి.. బీజేపీతో పొత్తేంటి
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీజేపీతో అంటకాగితే మనమూ మునిగిపోతాం. గాలికి పోయే కంపని గుడ్డకు తగిలించుకోవడం అవసరమా? అసలిప్పుడు మనమేంటి? మన రేంజ్‌ ఏంటి? బీజేపీతో పొత్తేంటి? టీడీపీలోని ఓ వర్గం నేతల్లో ఈ తరహా చర్చలు యమ జోరుగా జరుగుతున్నాయట. పువ్వు పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే… మన సీట్లు చిరిగిపోతాయని, కాస్త వెనకా ముందూ ఆలోచించమని అధిష్టానానికి చెప్పాలనుకుంటున్నారట కొందరు టీడీపీ సీనియర్స్‌. వాళ్ళ లెక్కలేంటి? టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉండమని ఎందుకు అంటున్నారు?

అమిత్‌ షా-చంద్రబాబు భేటీ తర్వాత.. మళ్లీ 2014 ఎన్నికల కాంబినేషన్‌ రాబోతోందనే చర్చ ఏపీలో జోరుగా జరుగుతోంది. నాడు టీడీపీతో బీజేపీ జతకట్టి పోటీ చేస్తే.. జనసేన మద్దతిచ్చి పోటీకి దూరంగా ఉంది. ఇప్పుడు జనసేన కూడా యుద్ధానికి సిద్దమైనందున ముగ్గురూ కలిసే బరిలో దిగుతారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. బీజేపీతో కలిస్తే… తమకు అడ్వాంటేజ్‌ ఉంటుందని ఇటీవలి వరకు టీడీపీ శ్రేణులు అనుకున్నా… ప్రస్తుతం ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో….కాషాయ పార్టీతో పొత్తంటే… అది అత్మహత్యా సదృశ్యమని అంటున్నారట ఎక్కువ మంది తెలుగుదేశం నాయకులు. కమలంతో పొత్తంటే…పక్కలో పదునైన కత్తిని పెట్టుకుని తిరిగినట్టేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్ల్లో బలంగా ఉందట. గత ఎన్నికల్లో వాళ్ళతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశాం.. ఇప్పుడు పెట్టుకుంటే మళ్లీ తప్పు చేసిన వాళ్లం అవడంతోపాటు నిండా మునుగుతామని అధినాయకత్వానికి సూచనలు కూడా చేస్తున్నారట కొందరు సీనియర్స్‌.

ఓవైపు కర్ణాటక ఫలితాలు.. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో పాటు.. ఏపీలో బీజేపీని బూచిగా చూపే దిశగా వైసీపీ పావులు కదపడంపై టీడీపీలోని కొందరు నేతలు కలవరపడుతున్నారట. ఏపీలో నడ్డా, అమిత్‌ షా పర్యటనల తర్వాత బీజేపీ విషయంలో వైసీపీ వైఖరిలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. స్వయంగా సీఎం జగన్‌ బీజేపీ సపోర్ట్‌ మనకు ఉండదని చెప్పడమే కాకుండా.. బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. గతంలో విశాఖ టూర్‌కి వచ్చిన ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్‌ గురించిగాని, రైల్వే జోన్‌ గురించి గాని, ఇతరత్రా ఏపీకి సంబంధించిన పెండింగ్‌ అంశాల గురించి మాట్లడకున్నా మౌనంగా ఉన్న వైసీపీ.. ఇప్పుడు అమిత్‌ షా, నడ్డాలు తమ పర్యటనల్లో స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌ వంటి డిమాండ్లపై మాట్లాడలేదని పదే పదే విమర్శలు గుప్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు సదరు టీడీపీ నాయకులు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. బలంగా ఉన్న ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇదే సందర్భంలో పార్టీ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. బీజేపీ చేసే రాజకీయాన్ని పూర్తిగా నమ్మలేమని, ఏపీకి వచ్చిన నడ్డా, అమిత్‌ షా జగన్‌ను.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించినా.. అవినీతి ఆరోపణలు చేసినా.. వాటిని జనం పెద్దగా నమ్మడం లేదన్న అభిప్రాయం కూడా ఉందట. ఇప్పటికీ జగన్‌కు బీజేపీ తెర వెనుక మద్దతు ఉందనే అంటున్నారు చాలా మంది టీడీపీ నేతలు. వైసీపీని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తూ…. ఏదో కామెంట్లు చేశారు తప్ప.. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా, వివిధ అంశాల్లో వ్యక్తిగతంగా జగన్‌కూ అటు కేంద్రం.. ఇటు బీజేపీ అగ్ర నేతలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నది ఎక్కువ మంది టీడీపీ నేతల మనసులో మాట. జరుగుతున్న పరిణామాలనే అందుకు ఉదాహరణలుగా చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ తన అవసరం కొద్దీ.. తెలంగాణ కోసం పొత్తు పెట్టుకున్నా.. వాళ్ళ మనస్సు మాత్రం జగన్‌తోనే ఉంటుందని అంటున్నారట. కొంత మంది నేతలు మనువు బీజేపీతో.. మనస్సు చంద్రబాబుతో అన్నట్టుగా ఉన్నారన్న విమర్శలు వస్తున్నా… వాస్తవానికి బీజేపీ జాతీయ నాయకత్వం మనస్సంతా జగనే నిండిపోయి ఉన్నారనేది ఏపీ టీడీపీలో లేటెస్ట్‌ టాక్‌. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్లస్‌ కంటే మైనస్సే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందనే విమర్శలు ఓవైపు రావడంతో పాటు.. జగన్‌ను టార్గెట్‌ చేసే విషయాన్ని బీజేపీ అధినాయకత్వం లైట్‌గా తీసుకుంటే.. పొత్తు నష్టమే తప్ప లాభమనేది ఉండదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరి చంద్రబాబు ఆలోచనేంటో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో కన్పిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • ntv
  • off the record
  • tdp vs bjp
  • telugu news

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions