PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తాను అధికార బాధ్యతలు చేపట్టేటప్పుడు ‘ఏది ఏమైనా సాధించి తీరాలి’ అనే దృఢ సంకల్పం తీసుకున్నానని, ఈరోజు దేశ ముఖచిత్రమే మారిపోయిందని ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఏదైనా చిన్న సంక్షోభం వస్తేనే భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయేదని, కానీ ఈ రోజు ఏ సంక్షోభం వచ్చినా భారత్ చూపిస్తున్న సామర్థ్యం గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోందని గుర్తుచేశారు. ఒకప్పుడు దేశంలో నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిని ‘పాలసీ పారాలిసిస్’ అని విమర్శించేవారని, కానీ నేడు దేశంలో ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ పరిగెడుతోందని తెలిపారు. పూర్వపు రోజుల్లో విదేశాల నుంచి దిగుమతులు (ఇంపోర్ట్) పెంచుకోవడానికి మార్గాలు వెతికేవారని, కానీ ఈ రోజు భారత్ స్వయంగా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి (ఎక్స్పోర్ట్) చేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజా సేవలో విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’లో మాట్లాడారు. ఈ సందర్భంగా 2014 కంటే ముందు దేశం ఉన్న పరిస్థితిని గుర్తుచేస్తూ.. ఆ రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని (ద్రవ్యోల్బణం పెరిగిపోవడాన్ని) అందరూ ‘చేతులెత్తేసిన వ్యవహారం’ (గాన్ కేస్) అని అనుకునేవారని అన్నారు. అప్పట్లో దేశానికి ఒక కొత్త ఉత్సాహం, కొత్త శక్తి అత్యవసరంగా కావాల్సి వచ్చిందని చెప్పారు.
వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి కూడా ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే.. 2015 నుంచి 2025 మధ్య ఉన్న ఈ దశాబ్ద కాలం వ్యవసాయ రంగంలో పాత రికార్డులన్నింటినీ తిరగరాసి సరికొత్త రికార్డులను సృష్టించిందని అన్నారు. మన ఆలోచన, ఉద్దేశం స్పష్టంగా ఉండి (నియ్యత్ సాఫ్), విధానాలు నిఖార్సుగా ఉన్నప్పుడే (నీతి స్పష్ట్) ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అనేది మంచి పాలనకు మూలస్తంభమని, అయితే దేశాన్ని చాలా కాలం పాటు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విడదీస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భారత్ ఎక్కడా తగ్గేదే లేదని, అసలు ఆగేదే లేదని మోడీ ధీమా వ్యక్తం చేశారు. మన దేశ ప్రాచీన వైభవాన్ని గుర్తుచేస్తూ.. ఒకప్పుడు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటికీ నాయకత్వం వహించేదని, అయితే విదేశీ దోపిడీదారుల పాలనలో దేశాన్ని దారుణంగా దోచుకున్నారని అన్నారు. ప్రపంచానికే మార్గదర్శనం చేసిన మన దేశంలో ఉన్న గొప్ప గ్రంథాలయాలను కూడా తగలబెట్టారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందను గుర్తుచేసుకుంటూ.. ‘ఏదో ఒక రోజు ఒక గొప్ప భారత్ పుట్టుకొస్తుంది’ అని వివేకానంద చెప్పిన మాటలను ప్రస్తావించారు.
Also Read
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!