Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naman Dhir Praises IPL and Mumbai Indians: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తనను అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం చేసిందని భారత యువ క్రికెటర్ నమన్ ధీర్ తెలిపాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీ తరఫున ఆడటం వల్ల క్రికెట్లో ఎదురయ్యే ఒత్తిడిని ముందుగానే అనుభవించానని చెప్పాడు. ఐపీఎల్లో ఎదురయ్యే పోటీ, ఒత్తిడి.. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ప్రవేశపెట్టినప్పటి నుంచి తనకు పెద్దగా బౌలింగ్ చేసే అవకాశాలు రావడం లేదని నమన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో నమన్ అరంగేట్రం చేశాడు. నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు.
‘ఐపీఎల్ మమల్ని అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ వంటి జట్టుతో ఐపీఎల్ ఆడితే అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌కు ముందుగానే సిద్ధమవుతాం. అందువల్ల అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చినప్పుడు పెద్దగా ఒత్తిడిగా అనిపించదు. ముంబై జట్టులోని స్టార్ ఆటగాళ్లు, అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడటం వల్ల యువ ఆటగాళ్లకు ఎంతో నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఐపీఎల్లో ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం, ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో ఆడటం యువ క్రికెటర్లకు అదనపు బలం. ఐపీఎల్లో ప్రతి మ్యాచ్‌పై ఉండే భారీ అంచనాలు, ప్రేక్షకుల ఒత్తిడి, ప్రత్యర్థి జట్లలోని స్టార్ ఆటగాళ్లను ఎదుర్కోవడం వంటి అంశాలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి’ అని నమన్ ధీర్ చెప్పాడు.
Also Read
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
- Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
ఐపీఎల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన కారణంగా తనకు బౌలింగ్ చేసే అవకాశాలు తగ్గిపోయాయని నమన్ చెప్పాడు. ‘నేను చాలా కాలంగా బౌలింగ్ చేస్తున్నాను. ఇప్పుడే మొదలు పెట్టింది కాదు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా నేను తక్కువగా బౌలింగ్ చేస్తున్నా. అంతే తప్ప నేను బౌలింగ్ చేయడం లేదని కాదు. భవిష్యత్తులో కూడా బంతితో మంచి ప్రదర్శనలు కొనసాగిస్తాను’ అని నామన్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌పై తన బౌలింగ్ వ్యూహం గురించి వివరించాడు. అక్షర్ పటేల్ నెమ్మదిగా బౌలింగ్ చేస్తూ పిచ్ నుంచి టర్న్ రాబట్టడాన్ని గమనించా అని, తాను కూడా అదే విధంగా బౌలింగ్ చేస్తే వికెట్లు సాధించవచ్చని భావించినట్లు చెప్పాడు.
తాజావార్తలు
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!