Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar Unexpected Return Story: భారత క్రికెట్లో ఒకప్పుడు స్వింగ్‌కు మారుపేరుగా నిలిచిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి టీమిండియా తలుపు తట్టాడు. 36 ఏళ్ల వయసులో, దాదాపు నాలుగేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న భువీ.. న్యూజిలాండ్‌తో ఈనెల 22న ఆరంభమయ్యే 5 టీ20ల సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2022 నవంబర్‌లో న్యూజిలాండ్పైనే భువనేశ్వర్ చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు. నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగి రావడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు భువీ కెరీర్‌కు ముగింపు పలికిందని భావించిన కారణమే.. ఇప్పుడు అతడి పునరాగమనానికి ప్రధాన బలంగా మారింది.
స్వింగ్ బౌలింగ్‌లో మాస్టర్:
తెల్ల బంతిని స్వింగ్ చేయడంలో భువనేశ్వర్ కుమార్‌కు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. చివరి క్షణంలో బ్యాటర్ బ్యాట్ అంచును తాకేలా బయటకు వెళ్లే ఇన్స్వింగర్లు, ఒక్కసారిగా దిశ మార్చుకుని బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టే ఇన్కట్టర్లు.. ఇవన్నీ భువీ బౌలింగ్‌లో కనిపించే ప్రత్యేకతలు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన భువీ.. అక్కడి క్రికెట్ సంస్కృతి నుంచి ఎదిగిన బౌలర్. మీరట్ స్వింగ్ బౌలర్లకు ప్రసిద్ధి చెందడంలో మాజీ భారత పేసర్ ప్రవీణ్ కుమార్‌ది కూడా కీలక పాత్ర. మీరట్ గాలిలోనే ఏదో ప్రత్యేకత ఉందని ప్రవీణ్ చెప్పేవాడని క్రికెట్ వర్గాల్లో సరదాగా చెప్పుకుంటారు. గాలిలో తేలుతూ దిశ మార్చుకునే బంతినే భువీ తన ప్రధాన ఆయుధంగా మార్చుకున్నాడు.
Also Read
- Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
- Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన:
భువనేశ్వర్ కుమార్ పునరాగమనానికి అతడి ఐపీఎల్ ప్రదర్శనే ప్రధాన కారణం. 2025, 2026 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఏకంగా 45 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా వంటి ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించినప్పటికీ.. బౌలింగ్ విభాగంలో భువీ తీసిన వికెట్స్ జట్టు విజయానికి బలంగా నిలిచాయి. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ వంటి బ్యాటర్లు చితకబాదడంతో భువీపై విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో అతడి వేగం తగ్గిందని, గతంలో కనిపించిన స్వింగ్ కూడా లేదని అన్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలోనూ అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. ఇక అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనని చాలామంది భావించారు.
సెలెక్షన్ పాలసీలో మార్పు:
అజిత్ అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో భారత జట్టు భవిష్యత్‌పై ఎక్కువగా దృష్టి పెట్టింది. యువ పేసర్లకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో భువనేశ్వర్ పునరాగమనంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. భువీ తిరిగి జట్టులోకి రావాలని కొందరు భావించినప్పటికీ.. సెలెక్టర్ల మరోలా ఆలోచించారు. సెలక్షన్ కమిటీలోని కొందరు సభ్యులు భువనేశ్వర్‌కు మద్దతుగా ఉన్నప్పటికీ, ఆ సమయంలో అతడి పునరాగమనానికి పెద్దగా మద్దతు లభించలేదు. ఇప్పుడు సెలెక్షన్ ప్యానల్ మారిన తర్వాత దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్లో భువీ చూపించిన నిలకడైన ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించింది.
విమర్శలకు సమాధానం:
భువనేశ్వర్ కుమార్ పునరాగమనంలో మరో ప్రత్యేకత అతడి నిశ్శబ్ద వైఖరి. జాతీయ జట్టుకు దూరమైన తర్వాత తనను ఎందుకు ఎంపిక చేయడం లేదంటూ అతడు ఎప్పుడూ బహిరంగంగా విమర్శలు చేయలేదు. ఎలాంటి సానుభూతి కోసం ప్రయత్నించకుండా.. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగాడు. ఉత్తరప్రదేశ్ తరఫున వైట్‌బాల్ క్రికెట్ ఆడుతూ యువ బౌలర్లకు మార్గదర్శకంగా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ కీలక ప్రదర్శనలు ఇచ్చాడు. బ్యాటర్లను స్వింగ్‌తో ఇబ్బంది పెట్టడం, కీలక సమయాల్లో వికెట్లు తీయడం ద్వారా తనలోని పాత బౌలర్ అలానే ఉన్నాడని నిరూపించాడు. నాలుగేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ.. భువీ తన నైపుణ్యాన్ని కోల్పోలేదు. వేగం కంటే స్వింగ్, అనుభవం, బంతిపై నియంత్రణ తన బలమని మరోసారి చాటాడు. అందుకే 36 ఏళ్ల వయసులో టీ20 క్రికెట్‌కు తిరిగి రావడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇప్పటివరకు భువనేశ్వర్ 87 టీ20ల్లో 90 వికెట్స్ పడగొట్టాడు. ఎంఎస్ ధోనీ హయాంలో భువీ ఓ వెలుగువెలిగిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!