Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tulsi Care Tips: ఇంట్లో తులసి మొక్కను పెంచడం అనేది మన ఇళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న కిచెన్ గార్డెన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ తులసి కుండీని పెట్టేస్తుంటాం. కానీ, తులసికి సరిగ్గా పక్కనే ఉంచే మరొక మొక్క దాని పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? నిజానికి ప్రతీ మొక్కకు నీరు, మట్టి, ఎండ, పోషకాల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని మొక్కలకు ఎక్కువ తేమ కావాలి, మరికొన్ని పొడి మట్టిలోనే బాగా పెరుగుతాయి. వేర్వేరు అవసరాలు ఉన్న మొక్కలను తులసికి చాలా దగ్గరగా పెడితే, రెండింటికీ తగినంత నీరు, పోషకాలు అందక ఇబ్బంది పడతాయి. దీని ప్రభావం తులసి ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. మొక్క పెరుగుదల మందగించడం, ఆకులు తక్కువగా రావడం లేదా వాటి రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే తులసి పక్కన వేరే ఏ మొక్కను ఉంచాలన్నా, ముందుగా దాని అవసరాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంట్లో కూడా తులసి మొక్క ఉన్నట్లయితే, దాని పక్కన ఏ మొక్కలను పెట్టకూడదు, ఏ మొక్కలు ఉంచితే బాగా పెరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం.
మొదటిది సేజ్ (Sage) మొక్క. సేజ్ మొక్కకు ఎక్కువ నీరు నచ్చదు, ఇది కాస్త పొడి మట్టిలోనే బాగా పెరుగుతుంది. కానీ తులసికి క్రమం తప్పకుండా నీరు, తేమ ఉన్న మట్టి అవసరం. ఈ రెండింటినీ ఒకే కుండీలో లేదా పక్కపక్కనే ఉంచితే నీటి అవసరాల విషయంలో సమస్య వస్తుంది. తులసికి తగ్గట్టు నీళ్లు పోస్తే సేజ్ మొక్కకు మట్టి ఎక్కువ తడిగా మారిపోతుంది, అదే సేజ్‌కు తగ్గట్టు నీళ్లు పోస్తే తులసికి సరిపడా తేమ అందదు.
Also Read
- INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
- AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
- Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
- UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
రెండవది సోంపు (Fennel) మొక్క. సోంపు మొక్క కూడా తులసికి మంచి పొరుగు మొక్క కాదు. దీని నుంచి విడుదలయ్యే కొన్ని సహజ రసాయనాలు పక్కన పెరుగుతున్న మొక్కల ఎదుగుదలపై చెడు ప్రభావం చూపుతాయి. కాబట్టి తులసి ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే సోంపు మొక్కను దానికి కాస్త దూరంగా ఉంచడమే మంచిది.
మూడవది దోసకాయ (Cucumber) మొక్క. దోసకాయ మొక్క బాగా పెరగడానికి చాలా నీరు, పోషకాలు అవసరం. తులసికి కూడా క్రమం తప్పకుండా నీరు, పోషణ కావాలి. ఈ రెండింటినీ చాలా దగ్గరగా నాటితే మట్టి నుండి రెండింటికీ సరిపడా నీరు, పోషకాలు అందవు. దీనివల్ల తులసి ఎదుగుదల తగ్గిపోతుంది.
నాలుగవది థైమ్ (Thyme) మొక్క. థైమ్, తులసి అవసరాలు కూడా చాలా వేర్వేరు. థైమ్కు పొడి మట్టి ఇష్టమైతే, తులసికి క్రమం తప్పకుండా తేమ ఉండాలి. అంటే ఒకే చోట ఈ రెండు మొక్కల అవసరాలను తీర్చడం చాలా కష్టం. అందుకే థైమ్ను తులసికి దూరంగా ఉంచడమే ఉత్తమం.
ఐదవది క్యాబేజీ, కేల్ (Cabbage & Kale). క్యాబేజీ, కేల్ చల్లని వాతావరణంలో బాగా పెరిగే మొక్కలు, కానీ తులసి వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. రెండింటి పెరుగుదల పరిస్థితులు వేరువేరుగా ఉండటం వల్ల వీటిని తులసికి పక్కనే నాటితే తులసి ఎదుగుదలపై నెగెటివ్ ప్రభావం పడుతుంది. మరి తులసి పక్కన ఏ మొక్కలను నాటడం మంచిది? తులసి పక్కన ఏ మొక్కనూ నాటకూడదని కాదు. సరైన మొక్కలను ఎంచుకుంటే తులసి చుట్టూ ఉన్న స్థలాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. టమోటా, బంతి పూలు (Marigold), ఒరేగానో (Oregano), పార్స్లే (Parsley) వంటి మొక్కలు తులసికి మంచి కాంబినేషన్లుగా భావిస్తారు. కాబట్టి మొక్కలు నాటేటప్పుడు కేవలం ఖాళీ స్థలాన్ని మాత్రమే చూడకుండా, ఆ మొక్కల అవసరాలను కూడా మనసులో ఉంచుకోవడం చాలా మంచిది.
తాజావార్తలు
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
-
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
-
Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!