Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi Singing: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరాజయమే ఎరుగని దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. రచయితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘పటాస్’ సినిమాతో మెగాఫోన్ పట్టి తొలి చిత్రంతోనే తన సత్తా చాటుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం విజయవంతమైన డైరెక్టర్‌గానే కాకుండా.. హీరోలాంటి లుక్స్, డ్యాన్స్, మిమిక్రీతో మల్టీ టాలెంటెడ్‌గా ఆడియన్స్‌ను అలరించడం అనిల్ ప్రత్యేకత.
తాజాగా ఈ ఆల్‌రౌండర్ దర్శకుడు బుల్లితెరపై సరికొత్తగా మెరిశారు. ప్రఖ్యాత సింగింగ్ రియాలిటీ షో ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’కు జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి, ఈ వేదికపై సింగర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌తో కలిసి ‘దళపతి’ సినిమాలోని ఐకానిక్ హిట్ సాంగ్ “సింగారాల పైరుల్లోన” పాటను పవర్‌ప్యాక్డ్‌గా పాడి స్టేజ్‌ను హోరెత్తించారు. వీరిద్దరి స్నేహబంధాన్ని వేడుక చేసుకుంటూ సాగిన ఈ పర్ఫార్మెన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
పాట ప్రారంభంలో అనిల్ రావిపూడి పాడిన తీరు, బాడీ లాంగ్వేజ్ ఎంతో వినోదాత్మకంగా ఉండటంతో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన వాయిస్ ప్రముఖ నటుడు సుడిగాలి సుధీర్ గొంతులా ఉందంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు అనంత శ్రీరామ్ తన మధురమైన స్వరంతో జతకలవడంతో ఈ ప్రదర్శన షోకే హైలైట్‌గా నిలిచింది. డైరెక్టర్, రైటర్, డ్యాన్సర్‌గా అలరించిన అనిల్.. ఇప్పుడు సింగర్‌గానూ ‘నెక్స్ట్ లెవెల్’ అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!