Off The Record : Bodhan చక్కెర ఫ్యాక్టరీ చుట్టూ కొత్త రాజకీయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలో పసుపు, చక్కెర కలిసిపోయి పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. గత ఎన్నికల్లో పసుపు ఒకరికి శుభం పలికితే… ఇంకొకరికి మర్చిపోలేని మంట పుట్టించింది. ఇప్పుడిక చక్కెర వంతొచ్చింది. ఇప్పుడది ఎవరికి స్వీటు? ఎవరికి ఘాటు కాబోతోంది? అసలు పసుపు, చక్కెర చుట్టూ జరుగుతున్న పొలిటికల్ గేమ్ ఏంటి? ఎక్కడ జరుగుతోందా రాజకీయం? నేతల మాటల్ని జనం మూట కట్టుకుంటున్నారా?
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. కాకుంటే… బోధన్ చక్కెర ఫ్యాక్టరీ కేంద్రంగా రాజకీయం రగులుకోవడమే ఆసక్తికరంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతో బాండ్ పేపర్ రాసిచ్చి బరిలో దిగిన ఎంపీ అర్వింద్.. ఈసారి బోధన్ షుగర్స్ ప్రధాన అజెండాగా రైతుల ఓట్లు కొల్లగొట్టే ప్లాన్ సిద్ధం చేశారట. పసుపు బోర్డు ప్రకటన ప్రధానితో ఇప్పించినట్టే… ఈసారి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటూ బాండ్ పేపర్ పాలిటిక్స్ కు రెడీ అయ్యారాయన. గతంలో పసుపు బోర్డు కోసం రైతులు నామినేషన్లు వేసినట్టుగానే ఈసారి చక్కర ఫ్యాక్టరీ కోసం కూడా నామినేషన్లు వేయాలని కూడా కార్మికులు, రైతులకు సూచిస్తున్నట్టు తెలిసింది. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్… ఇంకో అడుగు ముందుకేసి ఫ్యాక్టరీని తెరిపించడానికి బాండ్లు గీండ్లు ఎందుకు? ఎవరో వచ్చి చెప్పడమెందుకు? ఇక్కడ మేం లేమా అంటూ… అధికారిక కమిటీని వేసేసింది. ఇదిగో మా చిత్తశుద్ధి చూడండంటూ స్థానిక ఓటర్ల మనసు దోచుకునే పనిలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. గవర్నమెంట్ కమిటీ కూడా చక్కర ఫ్యాక్టరీని సందర్శించి రైతులు, కార్మికుల అభిప్రాయాలు సేకరించిందట. ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత మాదంటే మాదేనంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు హామీల మీద హామీలు ఇచ్చేస్తుండటంతో… నమ్మాలో, పొలిటికల్ స్టంట్స్ అనుకోవాలో అర్ధంగాక గందరగోళంలో ఉన్నారు రైతులు, కార్మికులు. దీని మీద రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తూ… హీట్ పెంచుతోంది.
Also Read
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
ఎన్నికల సమయంలో మాత్రమే షుగర్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు అంశాలు తెరపైకొస్తాయి. గత ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చిన ఎంపీ అర్వింద్… ఇందూరు వేదికగా ప్రధానితో ప్రకటన చేయించారు. ఐతే బోర్డును ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు. కానీ…బీజేపీ మాత్రం ప్రధాని ప్రకటించేశారంటూ ఏకంగా నిజామాబాద్‌లో బోర్డ్ పెట్టేసినంత హంగామా చేస్తూ రాజకీయం మొదలుపెట్టిందన్నది లోకల్ టాక్. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఉన్న అర్వింద్ బోధన్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు అనుబంధంగా ఉన్న ముత్యంపేట చక్కెర కర్మాగారం దాకా పాదయాత్ర చేశారు. తాను ఎంపీగా గెలిస్తే పారిశ్రామిక వేత్తలను తీసుకొచ్చి ప్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి మర్చిపోయి మళ్లీ బాండ్ అంటూ అదే అంశం మీద కొత్త రాజకీయం మొదలుపెడితే నమ్మాలా అన్నది క్వశ్చన్. ఎన్నికల సమయంలో ఫ్యాక్టరీ పేరుతో అన్ని పార్టీలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని మండిపడుతున్నారు
రైతులు, కార్మికులు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కువ శాతం చెరకు రైతులు ఉండటంతో..వారి మద్దతు కోసం మరోసారి ఫ్యాక్టరీ జపం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మరి రైతులు ఈసారి ప్రభుత్వ వేసిన కమిటీని నమ్ముతారా.. కేల అర్వింద్ ఇచ్చే బాండ్ పేపర్ కు జై కొడతారా అన్నది వేచిచూడాలి.
తాజావార్తలు
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్‌గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..