Off The Record: అధికార పార్టీ ఎమ్మెల్యేలకు.. పగవాడికి కూడా రాకూడని కష్టం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు వరద కష్టాలు మొదలయ్యాయట. భారీ వర్షాలకు..ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కురిసిన లిస్ట్‌లో మూడో స్థానంలో ఉంది నిజామాబాద్ జిల్లా. వర్షాల దెబ్బకు నిజామాబాద్ లో 40వేల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 20వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక్కడే ఎమ్మెల్యేలకు అసలు కష్టం మొదలయ్యిందట. వరద బాధితుల పరామర్శకు వెళ్తున్న కొందరు ఎమ్మెల్యేలు.. పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకు ఎలాంటి హామీ ఇవ్వలేక.. తలలు పట్టుకుంటున్నారట. ఇంకొందరైతే… ఈ గొడవంతా ఎందుకనుకుని అసలు వరద బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడటం కూడా మానేసినట్టు తెలిసింది. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఆదేశాలిస్తే.. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మినహా మిగతా వాళ్ళంతా ఆలస్యంగా కదిలారట. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆడియో రికార్డింగ్ పంపి.. చేతులు దులుపుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు మొక్కుబడి పర్యటనలతో మమ అనిపించారట. అసలు మేటర్ ఏంటయ్యా అంటే… పంట నష్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలే అమలవలేదని, ఇప్పుడు కొత్తగా రైతుల ముందుకు వెళ్ళి మళ్లీ ఏం చెప్తామని అనుకుంటున్నారట సదరు శాసనసభ్యులు.
ఏప్రిల్ చివర్లో కురిసిన అకాల వర్షంతో భారీగా పంట నష్టం జరిగింది. అప్పుడు ఎకరానికి 10వేలు ఇస్తామని ప్రకటించింది తెలంగాణ సర్కార్. తీరా వాస్తవంలోకి వచ్చేసరికి సవాలక్ష నిబంధనలతో రైతుల్ని సతాయించారన్న అపవాదు ఉంది. 30 శాతానికి మించి పంట నష్టం జరిగితేనే పరిహారం ఇస్తామన్న నిబంధనతో చాలా మంది రైతులకు నిరాశే మిగిలింది. అర్హులైన వారందరికీ కూడా ఇంకా ఖాతాల్లో డబ్బు జమ అవకముందే…వానాకాలం వచ్చేసి…. వేసిన పంట మునిగిపోయింది. దీంతో ప్రజల్లోకి వెళితే ఏం సమాధానం చెప్పాలో అర్ధంగాక పక్కకు తప్పుకుంటున్నారట ఎక్కువ మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు జనం మధ్యకు వెళ్తే… మరింత వ్యతిరేకత పెరుగుతుందని టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది.
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కురిసిన భారీ వర్షాలు.. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారాయని తలలు పట్టుకుంటున్నారట గులాబీ ఎమ్మెల్యేలు. ఇదంతా ఒక ఎత్తయితే… వీళ్లకు మరో రూపంలో ఇంకో రకమైమన కష్టం కూడా రాబోతున్నట్టు తెలిసింది. భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే..పరామర్శించకుండా ముఖం చాటేసిన ఎమ్మెల్యేల జాబితాను పార్టీ తెప్పించుకుందట బీఆర్ఎస్ అధిష్టానం. తాము చెప్పినా… ప్రజల్లోకి వెళ్లని వాళ్ళ లిస్ట్ రెడీగా ఉందట. ఈ అంశం పై త్వరలోనే వివరణ కోరే అవకాశం ఉందంటున్నారు. ప్రజల్లో వెళ్లిన వారికి ఒకరకం ఇబ్బంది ఉంటే.. వెళ్లని ఎమ్మెల్యేలు పార్టీ దృష్టిలోపలుచనయ్యారు. వరద కష్టాలు ఎట్నుంచి ఎటు టర్న్ అవుతాయో… ఎవరి సీటుకు ఎసరు పెడతాయో చూడాలి.
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!