ICC ODI World Cup 2023: గుడ్ న్యూస్.. వన్డే వరల్డ్ కప్ టికెట్స్ విడుదలకు డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తుంది. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ కార్యదర్శి జైషా ఢిల్లీలో.. మ్యాచ్‌లు జరుగనున్న అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో గురువారం మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించిన అనంతరం టికెట్ల జారీ విషయంపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా ఫిజికల్ టికెట్లు తీసుకెళ్లాలని.. ఆన్లైన్ టికెట్లకు పర్మిషన్ లేదని పేర్కొన్నారు.
Read Also: Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?
Also Read
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
కాగా అభిమానులు ఫిజికల్ టికెట్లను పొందడానికి 7-8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈసారి ఈ-టికెట్‌ని ఉపయోగించలేమని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. ఫిజికల్ టిక్కెట్లు పొందడానికి కేంద్రాలను ముందుగానే ప్లాన్ చేశామన్నారు. అహ్మదాబాద్, లక్నో వంటి పెద్ద కెపాసిటీ స్టేడియంలలో ఈ-టికెట్ల నిర్వహణ చాలా కష్టం.. మేం ముందుగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఈ-టికెటింగ్‌ని అమలు చేసి ఆపై ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లకు తీసుకెళ్లాలని మా ప్రణాళిక.. ప్రపంచకప్ టిక్కెట్ల ధరతో సహా అన్నీ త్వరలో ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చాడు.
Read Also: Belly Fat:ఈ డ్రింక్ ను తాగితే 7 రోజుల్లోనే కొవ్వు మైనంలా కరిగిపోతుంది..
ఇక ప్రోటోకాల్ ప్రకారం.. ఐసీసీ, బీసీసీఐలు ఒక్కో మ్యాచ్ కు 300 హాస్పిటాలిటీ టిక్కెట్లను తీసుకోనున్నాయి. ఇక రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు ఐసీసీకి 1295 లీగ్ గేమ్ టిక్కెట్లతో పాటు.. బీసీసీఐకి సంబంధించిన 1355 టికెట్లను.. వీటితో పాటు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్లను కూడా అందించనున్నాయి. మరో 500 జనరల్ టిక్కెట్లను మాత్రం సదరు క్రికెట్ అసోసియేషన్స్ బీసీసీఐకి ఫ్రీగా అందించనున్నాయి.
- Tags
- bcci
- icc
- jay shah
- odi world cup
- tickets
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!