ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తరువాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ని జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్, వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయటానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి.
WTC Final: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కి రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి తుది పోరు ప్రారంభం కానుంది. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐసీసీ... మ్యాచ్ అఫిషియల్స్ ను ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లను ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా నియమించారు.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 అణాగ్రంగా వైభవంగా మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 18వ సీజన్ కావడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఈ లీగ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఈసారి ఒక్క కోల్‌కతాలోనే…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-0తో రోహిత్ సేన కైవసం చేసుకుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 12) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ జై షా కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ వన్డేలో తాము అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.…
BCCI: బోర్డులో ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి రెడీ అయింది. ఇందులో భాగంగా.. వచ్చే నెల 12న ముంబైలో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది.
ACC Chairman Shammi Silva: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక ఆటగాడు షమ్మీ సిల్వా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన భారతదేశానికి చెందిన జై షా స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన మూడు పర్యాయాలు ACC ప్రెసిడెంట్ పదవిని చేసిన జై షా రాజీనామా చేసారు. ఇకపోతే, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC)లో సిల్వాకు ఇది మొదటి పాత్ర కాదు. ఆయన గతంలో ఈ…
డిసెంబరు 1న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. జై షా ఐసీసీ ఛైర్మన్‌గా వెళ్లడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ పదవికి ఇద్దరు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, ప్రస్తుతం బీసీసీఐ జాయింట్ సెక్రెటరీగా ఉన్న దేవ్‌జిత్ సైకియాలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. డీడీసీఏ ప్రెసిడెంట్ రోహన్…
PCB Chairman Mohsin Naqvi About Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా రావడం తమకేమీ ఆందోళన కలిగించడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మోసిన్ నక్వీ అన్నారు. జై షాతో తాము టచ్‌లోనే ఉన్నామని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లోనే జరగనుందని మోసిన్ స్పష్టం చేశారు. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా…
ఐసీసీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షాకు క్రికెట్ గాడ్, భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు కార్యదర్శిగా పురుషుల, మహిళల క్రికెట్‌కు సమాన ప్రాధాన్యత ఇవ్వడంలో జైషా చేసిన కృషిని సచిన్ ప్రశంసించారు.